Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 8 February 2020

Antarctica

Antarctica is Earth's southernmost continent. It contains the geographic South Pole and is situated in the Antarctic region of the Southern Hemisphere, almost entirely south of the Antarctic Circle, and is surrounded by the Southern Ocean.

అంటార్కిటికాలో ఈతకొట్టాం!
అంటార్కిటికా... భూమండలంపైన అత్యంత చల్లని ప్రదేశం. ఎటు చూసినా మంచుతో గడ్డకట్టిన పర్వతాలూ సాగరజలాలే. అలాంటి ప్రాంతంలో పర్యటించడం ఓ అద్భుతమైన అనుభవం’ అంటున్నారు ఖమ్మం వాసి డాక్టర్‌ కిషోర్‌.

అంటార్కిటికాలో పర్యటించాలంటే నవంబర్‌ నుంచి మార్చి వరకూ మాత్రమే అనుకూలం. అయినప్పటికీ ఏటికేడాది ఆ ఖండాన్ని సందర్శించే పర్యటకుల సంఖ్య పెరగడం విశేషం. కేవలం ఆ సమయంలో మాత్రమే కొన్నిచోట్ల జీరో నుంచి పది డిగ్రీలూ, మరికొన్నిచోట్ల -14 నుంచి -40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలూ ఉంటాయట. ఎందుకంటే కోస్తాతీరం, మైదానాలు, పర్వతాలు, లోపలిప్రదేశాలు...ఇలా ఒక్కోచోట ఒక్కోలా వాతావరణం మారిపోతుంటుంది. అందుకే ముందుగానే హర్టిగ్రూటన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ ద్వారా పర్యటనకి అవసరమైన అనుమతులు తీసుకున్నాం. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ అంటార్కిటికా టూర్‌ ఆపరేటర్స్‌ నిబంధనలను అనుసరించి చలికి తట్టుకునేందుకు అవసరమైన దుస్తుల్నీ ఇతరత్రా సామగ్రినీ సర్దుకున్నాం.

తొమ్మిది అంతస్తుల ఓడలో...
ప్రయాణంలో భాగంగా ముందుగా హైదరాబాద్‌ నుంచి అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌కు చేరుకున్నాం. అక్కడ దిగి గుర్రపుశాల చూడ్డానికి వెళ్లాం. అక్కడ గుర్రపుస్వారీ చేసి స్థానికంగా ఉండే అర్జెంటీనా పక్షుల్నీ జంతువుల్నీ, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ట్యాంగొ తెగకు చెందిన నృత్యాన్నీ చూశాం. బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఒకరోజు గడిపాక చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో వూస్వాయ్‌ నగరానికి చేరుకున్నాం. ఈ నగరానికి ఎండ్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అని పేరు. అంటే- భూగోళంమీద దక్షిణ ధ్రువంవైపు ఉండే చిట్టచివరి నగరంగా చెబుతారు. ఇక్కడ రోడ్లన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. భవనాలూ మంచుపర్వతాలూ బీచ్‌లతో అందంగా ఉందీ నగరం. మేం ప్రయాణించిన ఓడ పేరు మిడ్నట్సాల్‌. మొదటి రెండు అంతస్తులూ నీటి అడుగునా, మూడో అంతస్తు నీటికి సమంగానూ, మిగిలిన ఆరు అంతస్తులూ నీటి పై భాగంలోనూ ఉన్నాయి. ఎనిమిది, తొమ్మిది అంతస్తుల్లో ఓపెన్‌ డెక్‌ ఉంటుంది. అక్కడి నుంచి చుట్టూ ఉన్న ప్రదేశాల్ని చూడ్డానికి ఎంతో బాగుంది. ఐదూ ఎనిమిది అంతస్తుల్లో రెస్టరెంట్‌లు ఉన్నాయి. ప్రతి ఇద్దరికీ ఓ ప్రత్యేక గదీ, ఇరవై నాలుగు గంటలూ టీ, పాలూ, వేడినీళ్లూ... ఇలా అన్ని సదుపాయాలూ ఉన్నాయి.

ముందుగా చెబితే మనం అడిగిన భోజనం ఏర్పాటు చేస్తారు హోటల్‌ సిబ్బంది. రోజువారీ కాలక్షేపం కోసం ఆంఫి థియేటర్‌, జాకుజి... వంటివన్నీ ఉన్నాయి. ఈ ఓడకు ఆరు లైఫ్‌ బోట్లూ నలభై రకాల ఫిట్‌ బోట్లూ ఉన్నాయి. వీటి సాయంతో బయటి దృశ్యాల్ని హాయిగా చూడొచ్చు. ఓడ లోపల ఐదు సంవత్సరాల పిల్లల నుంచి తొంభై సంవత్సరాల వృద్ధుల వరకూ కనిపించేసరికి చలి భయం పోయింది.


వూస్వాయ్‌ నగరం నుంచి దాదాపు 36 గంటలపాటు ప్రయాణించి, మంచు ఖండానికి ఆనుకుని ఉన్న చిన్న ఐల్యాండ్స్‌కి చేరుకున్నాం. తొలిసారి సముద్ర ప్రయాణం చేసేవారికి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ముందుగా మేం కింగ్‌ జార్జ్‌ దీవి దగ్గర ఆగాం. దిగాక సిబ్బంది మమ్మల్ని ఒక్కో దీవి దగ్గరకూ తీసుకెళ్లి ఆయా ప్రదేశాల గురించి వివరించారు. అందులోభాగంగా యాంఖీ హార్బర్‌కి వెళ్లాం. అక్కడి వాతావరణం మంచు పూల వాన కురుస్తున్నట్లే ఉంది. చుట్టూ సముద్రం మీద కూడా అక్కడక్కడా పరచుకున్న తెల్లని మంచుముక్కలని చూస్తే నీటిలో పెద్ద సైజు మంచు పూలు విరిసినట్లే అనిపించింది. తరవాత బ్రౌన్‌ బ్లఫ్‌ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న పెంగ్విన్‌ పక్షుల సమూహాల్నీ ఎలిఫెంట్‌ సీల్స్‌నీ చూశాం. అక్కడి నుంచి చూస్తే ఎత్తైన మంచుకొండలూ ఆల్బట్రాస్‌, కెల్ప్‌ గల్స్‌... ఇలా రకరకాల పక్షులు కనిపించాయి.
అక్కడ ఈత కొట్టొచ్చు!
తరవాత ఎస్పరాంజా దీవికి చేరుకున్నాం. ఇక్కడకు పంతొమ్మిదో శతాబ్దంలో నార్వే, స్వీడన్‌, ఫ్రాన్స్‌కు చెందిన పర్యటకులు వచ్చి చిక్కుకుపోయారట. అలా ఓ ఏడాదిపాటు ఇక్కడ నానా ఇబ్బందులూ పడ్డారట. అప్పట్లో వాళ్లు పడ్డ ఇబ్బందులకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. అక్కడున్న నార్వే దేశానికి చెందిన బేస్‌ క్యాంప్‌కి వెళ్లాం. అక్కడే జీవిస్తున్న శాస్త్రనిపుణులతో కాసేపు మాట్లాడాం. వాళ్ల పిల్లల చదువుల కోసం స్కూలు కూడా ఉందట. వాళ్లు మాకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చారు. తరవాత డిసెప్షన్‌ దీవికి చేరుకున్నాం. ఈ దీవిలో అగ్నిపర్వతం ఉండటంవల్ల ఇక్కడి సముద్రపు నీళ్లు ఒకటిరెండు సెంటీమీటర్ల లోతువరకూ వేడిగా ఉన్నాయి. అడుగుభాగంలోని నీళ్లు మాత్రం మైనస్‌ డిగ్రీల్లోనే ఉన్నాయి. ఈ దీవిలో సముద్రపు నీటిలో ఈతకొట్టడానికి అనుమతి ఇస్తారు. మా బృందంలోని సభ్యుల్లో కొందరం ఈత కొట్టాం. వాళ్లకి హర్టిగ్రూటన్‌ ఫౌండేషన్‌ వాళ్లు సర్టిఫికెట్లను ఇచ్చారు. -2 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఈత కొట్టడం ప్రమాదకరమే అయినా ఆనందంగా అనిపించింది. ఇక్కడ ఆల్బట్రాస్‌ పక్షులు చాలానే ఉన్నాయి. పెద్ద రెక్కలు ఉన్న ఈ పక్షులు సముద్రంమీద వందల కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ఎగురుతాయట. అక్కడి నుంచి కొనె హార్బర్‌కు బయలుదేరాం. మంచులో నడవడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. మంచు పర్వతాలు ఎక్కేందుకు పెంగ్విన్లు ఏర్పాటుచేసుకున్న రహదారులు చూస్తే ముచ్చటేసింది. మేం కూడా ఆ దారిలోనే అక్కడి పర్వతం ఎక్కి మన జాతీయపతాకాన్ని పట్టుకుని ఫొటోలు దిగాం. ఆ సాయంత్రం కొండ చరియల్లో ఉన్న పక్షుల కాలనీలు చూడ్డానికి వెళ్లాం. సీడక్స్‌గా పిలిచే ఈ పక్షులు ఇక్కడ చాలానే ఉన్నాయి. అక్కడి నుంచి చిరిగానో దీవికి వెళ్లాం. ఇక్కడ అన్నీ ఎత్తైన పర్వతాలే. సూర్యకాంతి వల్ల మంచు ముక్కలు కొద్దిగా కరిగి పై నుంచి విరిగి పడుతుంటే పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు వినిపిస్తాయి. ఇవే నీటిలో పడి పెద్ద గ్లేసియర్స్‌గా మారి తేలుతూ వస్తుంటాయి. వీటిమీద పెంగ్విన్లూ ఇతర పక్షులూ ఠీవిగా నిలుచుని వస్తుంటే ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది. ఆ మంచు ముక్కలు సైతం నీటి రంగుతో పోటీపడుతూ నీలి రంగులో మెరుస్తున్నాయి. తరవాత డాంకో దీవికి చేరుకున్నాం. ఇక్కడ ఎత్తుగా ఉన్న మంచు పర్వతాల పైన ఐస్‌ స్కేటింగ్‌కి అనుమతి ఇచ్చారు. అక్కడ తిమింగలాలు ఎక్కువ. వాటికి సంబంధించిన జీవనవిధానాన్ని ఆంఫి థియేటర్‌లో వివరించారు.

ఆపై రాణె దీవికి చేరుకున్నాం. ఇది ఐస్‌ స్కేటింగ్‌కి అనుకూల ప్రదేశం. ఇక్కడ ఎలిఫెంట్‌ సీల్స్‌ కనిపించాయి. పెంగ్విన్‌ పక్షులు గుడ్లను పొదిగే విధానాన్ని కూడా గమనించాం. అడెలి జాతి పెంగ్విన్లలో మగపక్షి గూడుకట్టి ఆడపక్షిని ఆకర్షిస్తుంది. అది గుడ్లను పెట్టాక ఒకదాని తరవాత ఒకటిగా రెండు పక్షులూ గుడ్లను పొదుగుతాయట. జెంటూజాతి పెంగ్విన్లయితే గూడు కట్టడంలోనూ పొదగడంలోనూ రెండింటి  భాగస్వామ్యం ఉంటుందనీ, ఎంపరర్‌ జాతిలో మాత్రం మగపక్షి మాత్రమే పొదుగుతుందనీ గైడ్‌ వివరించాడు.

తరవాత మజిలీ ఆర్నె దీవి. మంచు గడ్డలతో అందమైన ఆల్గే రంగులతో చూడచక్కగా ఉంది. ఇక్కడ సీల్స్‌ సముద్రపు ఒడ్డున పడుకుని ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం కురిసిన మంచు సాగరజలాలమీద తేలుతూ ఎంతో అందంగా ఉంది. ఆ మర్నాడు డె మొయ్‌ పాయింట్‌కు వెళ్లాం. అక్కడ రోజంతా మంచులో నడుస్తూనే ఉన్నాం. షూ అడుగున స్పైక్స్‌ ఉండటం వల్ల ఎంత నడిచినా అలసట రాలేదు సరికదా సరదాగా అనిపించింది. తరవాత కవర్‌ విల్లే దీవికి చేరుకున్నాం. అక్కడ పెంగ్విన్‌ పక్షులు భారీ సంఖ్యలో గుడ్లను పొదుగుతూ వాటిని కాపాడుకుంటూ జీవిస్తున్నాయి. క్రిస్మస్‌ పండగ కావడంతో ఓడ అంతా సందడిగా ఉంది. పాటలూ నృత్యాలతో ఆనందంగా గడిపాం. చివరి మజిలీగా ఫార్నియర్‌ బే ఐల్యాండ్‌కు వెళ్లాం. ఇక్కడ ఓడలోని డెక్‌పై నుంచే చుట్టూ చూస్తూ మంచులో తడుస్తూ గంటన్నరసేపు విహరించాం. తిరుగు ప్రయాణంలో ప్యారడైజ్‌ హార్బర్స్‌, వెలర్స్‌ ఐల్యాండ్‌... వంటి అందమైన ప్రదేశాలు చూస్తూ సరదాగా గడిపాం. అలా 14 రోజుల అంటార్కిటికాలో పర్యటించాక వూస్వాయ్‌, బ్యూనస్‌ఎయిర్స్‌లనూ సందర్శించి హైదరాబాద్‌కు చేరుకున్నాం.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top