వాట్సప్ ఫీచర్లలో యూజర్లను బాగా ఆకట్టుకున్న, బాగా నచ్చిన ఫీచర్ 'స్టేటస్'. వాట్సప్‌లో స్టేటస్ చూడనివారు, స్టేటస్ అప్‌డేట్ చేయనివారు దాదాపుగా ఉండరు. అంతలా ఈ ఫీచర్ అందర్నీ ఆకట్టుకుంది. వాట్సప్ స్టేటస్ ఉపయోగిస్తున్నవారికి త్వరలో షాక్ ఇవ్వనుంది కంపెనీ. వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేయనుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్స్ ఎలా పనిచేస్తాయో వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ కూడా అలాగే కనిపించబోతున్నాయి. త్వరలోనే వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది కంపెనీ. గతేడాది నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సమ్మిట్‌లోనే 'స్టేటస్ యాడ్స్' గురించి వెల్లడించింది వాట్సప్.
స్టేటస్‌లో కనిపించే యాడ్స్‌లో అడ్వర్టైజర్ పేరు కూడా కనిపిస్తుందని చెప్పింది వాట్సప్.
వాట్సప్‌లో ఈ ఏడాది 'స్టేటస్ యాడ్స్' రావడం ఖాయం. అయితే ఎప్పట్లోగా ఈ ఫీచర్‌ని వాట్సప్ రిలీజ్ చేస్తుంది అన్నది తెలియదు. అయితే వాట్సప్ రిలీజ్ చేసిన ఫీచర్లలో ఎక్కువగా యూజర్లకు నచ్చింది స్టేటస్ ఫీచరే. అలాంటి స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేస్తే యూజర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. ఇప్పటికే వాట్సప్ ప్రైవసీ విషయంలో అనేక ఆందోళనలు ఉన్నాయి. ఇప్పుడు యూజర్ల డేటా అడ్వర్టైజర్ల చేతుల్లోకి వెళ్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

0 Comments:
Post a Comment