మెట్రోతో పోలిస్తే ఖర్చు బాగా తక్కువ
దాదాపు 60 కి.మీ.లలో నిర్మించాలని యోచన
ట్రాక్‌లెస్ ట్రామ్
విశాఖ నగర వీధుల్లో ట్రాక్‌లెస్ ట్రామ్ పరుగులు తీయనుంది. మెట్రో రైలు ప్రాజెక్టుకు భారీ వ్యయం చేయాల్సి రావటం.. అంత వెచ్చించినా ఆ స్థాయిలో ప్రయాణికులు ఉండరన్న కారణాలతో ప్రభుత్వం కొంతభాగంలో ట్రామ్ తరహా ప్రజా రవాణా వ్యవస్థ నిర్మించాలని నిర్ణయించింది. నగరంలో కొన్ని ప్రధాన మార్గాల్లో తప్ప మిగిలిన రూట్లలో ప్రయాణికుల తాకిడి తక్కువ. ఈ నేపథ్యంలోనే తక్కువ సమయంలో.. ఎక్కువ ఖర్చు లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని దీన్ని బీఆర్‌టీఎస్ మార్గం, ఇతర పర్యాటక స్థలాలను కలిపేలా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకంగా ఉండాలంటే...
●*●ఒక గంటలో సుమారు 8 వేలమంది...
●*ఒక రోజులో సుమారు లక్షన్నర మంది ప్రయాణించాలి
ట్రామ్ అంటే..
పట్టణ రవాణా వ్యవస్థలో ట్రాక్ లెస్ ట్రామ్ ఆధునికమైనది. చూడ్డానికి లైట్‌రైల్ తరహాలో ఉంటుంది. ట్రాక్ సహాయం లేకుండానే రహదారిపై విద్యుదయస్కాంత శక్తితో పరుగులు తీయడం దీని ప్రత్యేకత. చైనాలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. దీని కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదు. రహదారిమీదనే ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్ఛు
నగరంలో ఈ మార్గాల్లో..
నగరంలోని పర్యాటక స్థలాలు, ఎక్కువ ప్రాంతాలను కలిపేలా దాదాపు 60 కిలోమీటర్ల పొడవున ట్రాక్‌లెస్ ట్రామ్ నిర్మించాలన్నది ప్రతిపాదన. బీచ్ రోడ్డు, రుషికొండ - సాగర్‌నగర్, భీమిలి మార్గాలతో పాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు పెందుర్తి - ఎన్‌ఏడీ, అనకాపల్లి - స్టీల్‌ప్లాంటు ప్రాంతాల్లో దీన్ని నడపాలని అధికారులు యోచిస్తున్నారు.
●8మొదటి దశలో స్టీల్‌ప్లాంటు - కొమ్మాది, గురుద్వారా - పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం - చినవాల్తేరు కారిడార్లలో మెట్రో రైలు వస్తుంది. రెండో దశలో పేర్కొన్న కొన్ని మెట్రో రైలు కారిడార్లకు బదులు ట్రామ్ వస్తుంది.
డీపీఆర్‌కు అంతా సిద్ధం
మెట్రో రైలు ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మార్గాల్లో రద్దీపై ఇప్పటికే పరిశీలన పూర్తయింది. ట్రామ్ నడిపే ప్రాంతాల్లో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాల్సి ఉంది. ఆరు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక వస్తుంది. మొత్తం ఎంత ఖర్చవుతుందో అప్పుడే స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సమీక్షించిన నేపథ్యంలో అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే విశాఖలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు వీఎంఆర్‌డీఏ భవనంలోని ఓ కార్యాలయాన్ని ఇటీవల మెట్రో అధికారులు పరిశీలించారు.

0 Comments:
Post a Comment