SBI: పండుగ పూట షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ... కస్టమర్లకు నష్టమే
జనమంతా సంక్రాంతి పండుగ సందడిలో ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు 2020 జనవరి 10 నుంచే అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఏడాది నుంచి 10 ఏళ్ల లోపు లాంగ్ టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గింది. ఏడు రోజుల నుంచి 1 ఏడాది వడ్డీ రేట్లల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఎస్‌బీఐ ఏడాది నుంచి రెండేళ్ల లోపు వడ్డీ రేట్లపై 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
7 రోజుల నుంచి 45 రోజులు- 4.50%
46 రోజుల నుంచి 179 రోజులు- 5.50% 180 రోజుల నుంచి 210 రోజులు- 5.80%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 5.80%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.10%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.10%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.10%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.10%
పిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ ఇస్తుంది ఎస్‌బీఐ.
0 Comments:
Post a Comment