సంక్రాంతి సౌందర్యమిది
అమృతాన్ని చిన్న బుచ్చే చామంతి
నేలమీదుంటే
సంక్రాంతి నేలకు రాకుండా ఉంటుందా...
పుడమిపై పుత్తడి పూబంతి
రంగులేస్తుంటే
సంక్రాంతి స్వర్గాన్నైనా వీడకుంటుందా...
సంప్రదాయపు బాల కిరణమై
ఆచార పుష్పంగా పరిమళించిన
ఈ మనసున్న మరకతమణిని చూసి
సోమరితనంతో కళ్ళుతెరువని చీకటితనం చిన్నబోకుండా ఉంటుందా..
తల్లిదండ్రుల యాగఫలమో
దైవపు సంకల్పబలమో
సనాతనపు సౌందర్య సొగసై
ఆదర్శభావంతో శ్రీమాతే దర్శనమిచ్చిందిలా...
😊😊 అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు😊😊
అభిరామ్
0 Comments:
Post a Comment