ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ శుభవార్త అందించనుంది. ఇకపై కంపెనీలో 10 మంది ఉద్యోగులు ఉన్నా కూడా వారికి పీఎఫ్ వర్తించొచ్చు' అంటూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇవ్వన్నీ రూమర్లని కొట్టిపారేసింది.
ఈపీఎఫ్ చట్టం ప్రకారం.. 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న కంపెనీలకు పీఎఫ్ వర్తిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్రం 20 మంది నిబంధనలు 10 మందికి తగ్గించొచ్చనే నివేదికలు వెలువడ్డాయి. వీటికి కార్మిక శాఖ ఇప్పుడు స్పందించింది. 'కొన్ని న్యూస్ పేపర్లలో ప్రచురితమైన నివేదికలను ఖండిస్తున్నాం. ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారం 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీకి పీఎఫ్ వర్తిస్తుంది.
ఈ సంఖ్యను తగ్గిస్తామనే అంచనాలను కొట్టిపారేస్తున్నాం' అని మోదీ సర్కార్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వెలువడిన నివేదికల ప్రకారం.. పీఎఫ్ వర్తింపు పరిమితిని 10 మందికి తగ్గింపునకు సంబంధించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కొత్త రూల్స్ 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే వీటిల్లో కూడా నిజం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
20 కన్నా తక్కువ మంది ఉన్న కంపెనీలకు పీఎఫ్ వర్తింపు అంశం తమ వద్ద పరిశీలనలో లేదని కార్మిక శాఖ తెలిపింది. 20 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది లేనటువంటి కంపనీలకు పీఎఫ్ చట్టం వర్తించదు. అయితే ఈ కంపెనీల్లో పనిచేసే వారికి వాలంటరీ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఉద్యోగులు కావాలని భావిస్తే స్వచ్ఛందంగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో చేరొచ్చు.
కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలు కూడా స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌లో భాగం కావొచ్చు. అడ్వాన్స్ పార్ట్ విత్‌డ్రాయెల్ ఆప్షన్‌ను మళ్లీ తీసుకురావాలని ఈపీఎఫ్‌వో గతంలోనే నిర్ణయించింది. కార్మిక శాఖ దీన్ని అమలుకు ఓకే చెప్పింది.
జనవరి 1 నుంచి ఈ ప్రయోజనం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. 2009కి ముందు వరకు 6 లక్షలకు పైగా పెన్షనర్లు పెన్షన్ కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకున్నారు. అయితే ఈపీఎఫ్‌వో 2009లో ఈ ఫెసిలిటీని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ అమలోకి తెచ్చింది

0 Comments:
Post a Comment