నోకియా తన పాత ఫీచర్ ఫోన్లను ఒక్కొక్కటిగా తిరిగి లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా నోకియా మరో ఒరిజినల్ ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్ ఎండీ గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జూహో సర్వికాస్ ఈ మేరకు ట్వీట్ చేశారు. కచ్చితంగా ఎప్పుడు వస్తుంది అని తేదీ చెప్పకపోయినా.. తన ట్వీట్ లో ఆయన #nokia #original #chinesenewyear అని పేర్కొన్నారు. దీంతో ఆ ఫోన్ జనవరి 25న రానుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చైనీస్ న్యూ ఇయర్ ఆరోజు జరగనుంది మరి. కానీ ఇప్పటి వరకు హెచ్ ఎండీ గ్లోబల్ నోకియా ఒరిజినల్ ఫోన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే నోకియా గతంలో హిట్ అయిన తన మొబైల్ కే అప్ గ్రేడెడ్ వెర్షన్ ను తీసుకువచ్చే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
నోకియా బ్రాండ్ మొబైల్స్ ను తయారు చేసే హెచ్ ఎండీ గ్లోబల్.. గత సంవత్సరం నోకియా 2.3 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కానీ కొత్త సంవత్సరంలో ఈ ఒరిజినల్ ఫోన్ తో నోకియా మళ్లీ బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు లాంచ్ అయిన నోకియా పాత ఫోన్లను చూసినట్లయితే..
నోకియా 8110 మ్యాట్రిక్స్ ఫోన్ కు సరికొత్త వెర్షన్ గా నోకియా 8110 4జీ వెర్షన్ 2018లో లాంచ్ అయింది. 4జీ కనెక్టివిటీతో పాటు.. కొన్ని శక్తివంతమైన ఇంటర్నల్స్, సరికొత్త ఆపరేటింగ్ సిస్టం అయిన కైఓఎస్ తో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అనంతరం నోకియా 2720 ఫ్లిప్ ఫోన్, నోకియా 110 మొబైల్స్ ను కూడా నోకియా మార్కెట్లోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ కి తర్వాత వెర్షన్ అయిన నోకియా 9.2పై హెచ్ఎండీ దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. గతంలో దీనికి నోకియా 9.1 అని పేరు పెట్టినా ఇప్పుడు దీన్ని 9.2 అని మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఈ సంవత్సరం విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను ఇందులో వినియోగించనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది.

0 Comments:
Post a Comment