ఇల్లు కొనుగోలు చేయడం ద ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు. అది కొందరికి సులభంగా సాధ్యమైతే మరికొందరికి ఆర్థికంగా అదొక భారం. అయితే ఒక సొంత ఇల్లు ఉండాలనేది కూడా ప్రతి ఒక్కరి చిరకాల వాంఛ. ఈ క్రమంలో అనేక ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసే సమయంలో అసలు ఆస్తి విలువ కాకుండా చెల్లించవలసిన అదనపు వ్యయాలు ఏమేం ఉంటాయో చూడాల్సిందే.
రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ: ఒక ఇల్లు లేదా ఆస్తిని మీ పేరు మీదకు మార్చుకోడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియ మొత్తం స్థానిక సబ్-రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఆస్తి విలువలో 0.5 శాతం నుంచి 4 శాతం వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కో రాష్టంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది.
ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఆస్తితో పాటు జాగ్రత్తగా చూసుకోవాల్సింది స్టాంప్ డ్యూటీ. ఇది ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను. ఇది అన్ని రకాల ఆస్తుల లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. ఇది ఆస్తి విలువలో 3 నుంచి 8 శాతం ఉంటుంది. స్టాంప్ డ్యూటీ ఒక్కో రాష్టంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. ఆస్తి ఒప్పంద విలువ లేదా ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంది.
జీఎస్టీ, మధ్యవర్తి ఫీజు, ఇతర చార్జీలు: అలాగే నిర్మాణంలో ఉన్న ఆస్తులకు 12 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. అదే నిర్మాణం పూర్తై ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఆస్తులపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ఇల్లు కొనడానికి మధ్యవర్తిని పెట్టుకుంటే మాత్రం, ఆస్తి విలువలో 1 నుంచి 2 శాతం డబ్బును మధ్యవర్తి చెల్లించడం సబబే. అలాగే మెయిన్ టెయినెన్స్ చార్జీల కింద సంవత్సరానికి ఒక చదరపు అడుగుకి గాను రూ.1.50 నుంచి రూ.3 వరకు నిర్వహణ ఛార్జీలను బిల్డరుకు చెల్లించవలసి ఉంటుంది. బిల్డరుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, మీరు చెల్లించవలసిన సొమ్మును ఆలస్యంగా చెల్లించినట్లైతే అప్పుడు మీరు బిల్డరుకు సంవత్సరానికి 18 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. వీటితో పాటు అపార్ట్ మెంటులో కారు పార్కింగ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి సదుపాయాలు కావాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

0 Comments:
Post a Comment