విద్యా సంస్థల్లో సదుపాయాల కల్పనకు యాన్యూటీ విధానం
‘నాడు-నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో రెండో విడతలో చేపట్టనున్న కొన్ని పనులకు యాన్యూటీ విధానం అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వంద మందికి పైగా విద్యార్థులు ఉండే ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5వేల ఉన్నత పాఠశాలలు, 151 డిగ్రీ కళాశాలలు ఈ పరిధిలోకి వస్తున్నట్లు తేల్చారు. యాన్యూటీ విధానం ప్రకారం.. పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టనున్న పనులకు ఇంజినీర్లు అంచనాలు రూపొందిస్తారు. ఈ మొత్తానికి టెండర్లు పిలుస్తారు. ఎంపికైన గుత్తేదారు బ్యాంకు నుంచి రుణం తీసుకుని పనులు చేపడతారు. ప్రభుత్వం గుత్తేదారుకు వడ్డీతోపాటు ప్రోత్సాహకంగా కొంత మొత్తం కలిపి విడతల వారీగా చెల్లింపులు చేస్తుంది. ఈ కాలపరిమితి 7 లేదా 10 ఏళ్ల వరకు ఉండే అవకాశం ఉంది. వచ్చే జూన్ నుంచి యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

0 Comments:
Post a Comment