అహ్మదాబాద్ : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ కారు యజమానికి అధికారులు రూ.27.68 లక్షలు జరిమానా విధించారు. ఇటువంటి సంఘటనల్లో ఇప్పటి వరకు మన దేశంలో విధించిన అత్యధిక జరిమానా ఇదేనని అహ్మదాబాద్ పోలీసు అధికారులు చెప్పారు.
2019 నవంబరులో పోర్షే కారును నడుపుకుంటూ దాని యజమాని పట్టుబడ్డారు. ఆ కారుకు నంబర్ ప్లేట్ లేదు, అవసరమైన ముఖ్యమైన దస్తావేజులు లేవు. దీంతో మొదట్లో దాని యజమానికి రూ.9.80 లక్షలు జరిమానా విధించారు. ఆరు వారాల తర్వాత ఈ జరిమానాను పునఃసమీక్షించి, జరిమానాను రూ.27.68 లక్షలకు పెంచారు. మన దేశంలో ఇదే అత్యధిక జరిమానా అని, ఇదొక రికార్డు అని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు.
వాహనాన్ని నడిపేటపుడు అవసరమైన పత్రాలు : వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), ఇన్సూరెన్స్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్.
0 Comments:
Post a Comment