మీరు ఎక్కడ ఉన్నారో గూగుల్ కు తెలుసు.. మీరు ఫోన్లో ఏం చేస్తున్నారో కూడా గూగుల్ కు తెలుసు. మీ ప్రతి మూమెంట్ పై గూగుల్ కంట కనిపెడుతోంది జాగ్రత్త.. ఎక్కడికి వెళ్లానా ప్రతి క్షణాన్ని ఇట్టే పసిగట్టేస్తుంది. గూగుల్ నుంచి తప్పించుకోలేరు. ఇంతకీ గూగుల్ కు మన మూవెంట్ ఎలా తెలుస్తుందంటే.. ఇంకేముంది గూగుల్ మ్యాప్స్ ఉండనే ఉంది కదా. ఇదే మిమ్మల్ని గూగుల్ పసిగట్టేలా చేస్తోంది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో Google Maps ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడా ఉన్నామో మ్యాప్స్ సాయంతో ఈజీగా లొకేషన్ కనిపెట్టవచ్చు. మీరు వాడే డివైజ్ కావొచ్చు.. మరి ఏదైనా కావొచ్చు.. సరైన పద్ధతిలో గూగుల్ మ్యాప్స్ సెట్ చేయలేదా?
మీరెక్కడన్నారో గూగుల్ పసిగట్టేస్తుంది. నడిచినా లేదా డ్రైవింగ్ చేసినా గాల్లో ఎగిరినా సరే.. మీ ప్రతి మూమెంట్ గూగుల్ సర్వర్లలో స్టోర్ అవుతుంది జాగ్రత్త.
ఈ క్షణం ఇప్పుడు ఎక్కడ ఏ లోకేషన్ లో ఉన్నారో కూడా చెప్పేస్తుంది. అదేలా అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కామన్ అయిపోయింది. ఆన్ లైన్ లో ఏదైనా యాక్సస్ చేసుకోవాలంటే లొకేషన్ పర్మిషన్ ఇస్తుంటారు. మీ ఫోన్లలో కూడా లొకేషన్ ఎనేబుల్ చేసి ఉంటే.. గూగుల్ అకౌంట్ ఆధారంగా మీ లొకేషన్ డేటా ఎప్పటికప్పుడూ స్టోర్ అవుతుంది.
మీరు చేసే ప్రతి పని ఒకరు గమనిస్తున్నారంటే కాస్త ఇబ్బందిగానూ కనిపిస్తుంది. కనీసం ప్రైవసీ కూడా లేదా అనిపిస్తుంది. ఎక్కడో ఉన్న గూగుల్ సర్వర్లలో స్టోర్ అయిన లొకేషన్ డేటా ఎలా డిలీట్ చేయాలో తెలియదా? ఇదిగో మీ కోసమే ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ రిలీజ్ చేసింది.
గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ లొకేషన్ డేటా స్టోర్ అయిన తేదీ నుంచి ప్రతి 18 నెలలు లేదా ప్రతి 3 నెలలకు ఆటోమాటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. గూగుల్ ఇప్పటికే తమ అకౌంట్ పేజీలో సెట్టింగ్ చేసింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎలా మ్యాన్యువల్ గా సెట్ చేసుకోవాలో చూద్దాం.
ఇదిగో ప్రాసెస్..
* మీరు వాడే ఆండ్రాయిడ్/ఐఫోన్ లో Google Maps యాప్ ఓపెన్ చేయండి.
* యాప్ టాప్ లెఫ్ట్ లో మెనూ బార్ పై Tap చేయండి.
* Your Timeline పై ఎంచుకోండి.
* టాప్ రైట్ స్క్రీన్‌లో మూడు (...) డాట్స్‌పై ట్యాప్ చేయండి.
* Settings, Privacy ఆప్షన్లను ఎంచుకోండి.
* Automatically Delete లోకేషన్ హిస్టరీని Select చేయండి.
* Keep untill I delete manually అనే సెట్టింగ్ మార్చుకోండి.
* Keep for 18 months లేదా Keep for 3 months సెట్ చేసుకోండి.
అంతే.. మీ లొకేషన్ హిస్టరీ మీ నిర్దిష్ట సమయానికి ఆటోమాటిక్ గా డిలీట్ అయిపోతుంది. గూగుల్ మ్యాప్స్ ప్రతి 3 నెలలకు డిలీట్ చేసుకునేలా సెట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. అంతకంటే ఎక్కువ కాలం డేటా ఉండాల్సిన అవసరం ఉండదు కదా. మీ ప్రైవసీకి తగినట్టుగా 18 నెలల వరకు సెట్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment