ఏపీ ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం (జనవరి 3, 2020) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 6 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశంపై పంచాయతీరాజ్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై (జనవరి 7, 2020) తేదీ లోపు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 8వ తేదీ స్థానిక సంస్థల షెడ్యూల్ అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
నెల్లూరు...ఎస్టీ,
అనంతపురం..ఎస్సీ,
విజయనగరం..ఎస్సీ (మహిళ),
చిత్తూరు...బీసీ,
కృష్ణా...బీసీ,
విశాఖపట్నం..బీసీ (మహిళ),
పశ్చిమ గోదావరి...బీసీ (మహిళ), శ్రీకాకుళం...జనరల్,
కడప...జనరల్,
ప్రకాశం...జనరల్,
తూర్పుగోదావరి...జనరల్ (మహిళ), గుంటూరు...జనరల్ (మహిళ),
కర్నూలు...జనరల్ (మహిళ)
ప్రకారం పరిషత్ రిజర్వేషన్లు ఖరారు చేశారు.

0 Comments:
Post a Comment