వికేంద్రీకరణ, సమానాభివృద్ధి చట్టంతో 3 ప్రాంతీయ బోర్డులు
- అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానున్న ప్రభుత్వం
ఎపిసిఆర్‌డిఎ చట్టం రద్దుకు, ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ, సమానాభివృద్ధి చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 20న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టనున్నారు. సిఆర్‌డిఎ స్థానంలో ఒకప్పటి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి నగరాభివృద్ధి సంస్థ (విజిటిఎం వుడా)ను పున:ప్రతిష్టనుంచనున్నారు. ఈ రెండు బిల్లులకు సంబంధించిన సారాంశం, లక్ష్యాలూ ఇలా ఉన్నాయి.
'ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రిపీల్ యాక్టు 2020' పేరుతో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం 2014లో ఏర్పాటైన సిఆర్‌డిఏ రద్దు కానుంది. ఆ స్థానంలో 2016 మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం కింద విజిటిఎం ఉడాను ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకూ సిఆర్‌డిఏ తీసుకున్న అన్ని రుణాలనూ విజిటిఎం ఉడాకు బదిలీ చేస్తారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఇప్పటి వరకూ సిఆర్‌డిఏ ఏర్పడ్డాక నియమించిన అధికారులను, సిబ్బందిని వారి మాతృ సంస్థకూ లేదా ఇతర ప్రభుత్వ శాఖలకూ బదిలీ చేయనున్నట్లు ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్నారు.
పూలింగు కింద భూములిచ్చిన రైతులకు వారికి చెందాల్సిన ప్లాట్లకు సంబంధించి అన్ని హక్కులూ కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం భూములను బదలాయించిన వ్యక్తులు వారి హక్కు లను తిరిగి పొందేందుకు అవకాశం కల్పించారు. బాండ్లు, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదలాయిస్తారు. అలాగే రైతులకు ఇస్తున్న యాన్యుటీని మరో మూడేళ్లపాటు అమల్లో ఉంచనున్నారు. ల్యాండ్ పూలింగు పథకానికి భూములిచ్చిన రైతులకునెకరానికి 200 చదరపు గజాల చొప్పున రాజధానిగా ప్రకటించే ప్రాంతంలో అదనపు స్థలాన్ని ఇవ్వనున్నారు.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనూ సమాన అభివృద్ధి చేయడం, విభాగాలు, డిపార్టుమెంట్ల వారీగా సమాన అభివృద్ధి చేయడం ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, సమానాభివృద్ధి చట్టం ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడదీయనున్నారు. ఆయా ప్రాంతాల వారీగా జోన్లను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక కమిషనరేట్లు ఏర్పాటు చేయనున్నారు. వాటికి తొమ్మిది మంది సభ్యులకు మించకుండా అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తారు.
ఈ బోర్డులో ముఖ్య మంత్రి, వైస్ ఛైర్మన్, ఆ ప్రాంత పరిధిలోని ఒక పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు. వీరితోపాటు మరో నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ప్రినిపల్ సెక్రటరీ హోదాకు తగ్గని వ్యక్తిని పూర్తికాలం కార్యదర్శిగా నియమిస్తారు. ప్రజల ఆకాంక్షలు ఏమిటో గుర్తించడంతోపాటు, వాటి కల్పనకు ప్రాంతీయ కమిషనరేట్లు పని చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

0 Comments:
Post a Comment