4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు
ఈనెల 4 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల్లో విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని కోరారు.
4న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.
5న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.
6న సెలవు
7న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.
8న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని వివరించాలని పేర్కొన్నారు.
9న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
ఈమేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
0 Comments:
Post a Comment