అమరావతి నుంచి విశాఖపట్నం నగరానికి సచివాలయాన్ని తరలించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. ఏప్రిల్ 6వ తేదీన ముహూర్తంగా నిర్ణయించింది. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం నుంచి విశాఖలో సచివాలయం నుంచి పనులు జరగాలని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో అధికారిక ఉత్తర్యులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంత కంటే ముందుగానే ఉద్యోగులను వైజాగ్ కు తరలించే సన్నద్ధం చేస్తోంది. అమరావతిని శాసన రాజధాని, విశాఖను పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో రైతులు 16 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
అయితే, జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చినా, బీసీజీ కమిటీ రిపోర్టు రావాల్సి ఉంది. ఈ రెండు నివేదికలు వచ్చిన తర్వాత దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఆ రెండు రిపోర్టులను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీలో దీనిపై చర్చించిన తర్వాత ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
న్యూస్ 18 తెలుగు.... వారి కథనం...
0 Comments:
Post a Comment