చూడవచ్చె సూరీడు!(సంక్రాంతి గేయం)
వాకిళ్లలో ముగ్గులన్నిచూడవచ్చె సూరీడు!
మకరతారలందరికి
అతడేకదా సరిజోడు!
గొబ్బెమ్మల చుట్టుచేరి
పాట పాడు కన్నెలను!
కన్నెలనూ,వన్నెలనూ
చామంతుల చిన్నెలను
సంక్రాంతికి నవశోభను
అందించిన వెలుగు ఱేడు!
వచ్చినాడు సూరీడు
వారాశిని స్నాన్నమాడ!
చిరు మంటను భోగీకి
కానుక గా యిచ్చినాడు!
వరిపంటను రైతన్నకు
సిరి రూపున యిచ్చినాడు!
వచ్చినాడు సూరీడు
వాకిళ్లను చూడ నేడు!
హరిదాసుల కీర్తనలను
ఆలకించి పరవశించి
బసవన్నను కిరణాలతొ
బహుచక్కగ దీవించి!
సన్నాయికి ప్రసన్నుడై
ఆకాశమునాడినాడు,
వచ్చినాడు సూరీడు
కమలాలకు బాంధవుడు!
ఉత్తరాయణమున వచ్చి
పౌష్యలక్ష్మి నిచ్చినాడు!
దివ్యలోక వాసులకు
మోక్షమునిడు దైవమతడు!
వచ్చినాడు సూరీడు!
ఛాయా దేవత మగడు!
కనుమనాడు సొమ్ములగని
సొమ్ములె మీ సొమ్ములనుచు
పూజింపుడు మీరనచు
పురజనులకు తెలియజేయ
వచ్చినాడు సూరీడు
వెలుగు కలిమి పంచనేడు!
కిలపర్తి దాలినాయుడు
0 Comments:
Post a Comment