ప్రయివేటు టీచర్ల సమస్యలపై జైలుకు వెళ్లడానికైనా వెనుకాడం
- ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు
ప్రయివేట్ టీచర్ల సమస్యలపై పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నామని పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్షణరావు అన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహించే పోరాటంలో అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా వెనుకాడబోమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ భవనంలో ప్రయివేట్ టీచర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రయివేట్ టీచర్ల రాష్ట్ర సంక్షేమ సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న వారు మాట్లాడుతూ మన రాష్ట్రం ప్రభుత్వ విద్యారంగం దేశంలో 27 స్థానంలో ఉండగా, ప్రయివేటురంగంలో మాత్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు అత్యధికగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని విమర్శించారు. ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రయివేటు టీచర్ల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రతి టీచర్లకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. చిక్కాల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, ఆదిమాంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజు, ఇతర సంఘాల నాయకులు ఆర్.సి.పి.రెడ్డి, జువ్వనపూడి అజరు సతీష్, నూర్ మహ్మద్, ఎం.దినేష్, నీలం స్వరూపరాణి, విశ్వమోహన్, ఎల్.ఆనంద్ పాల్గొన్నారు.

0 Comments:
Post a Comment