ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానిపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ ఈ దెబ్బతో గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం. అమెరికాతో కయ్యం కొనసాగిస్తున్న తనను కూడా సోలేమని తరహాలోనే ట్రంప్ ఆదేశాలతో అమెరికా హతం చేస్తుందనే భయంతో కిమ్ కన్పించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా మీడియా వార్తల ప్రకారం డిసెంబర్ 31, 2019 నుంచి కిమ్ ఎక్కడ ఉన్నారనేది గోప్యంగా ఉంది. గత సంవత్సరం చివరి రోజు వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సెషన్ ముగిసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పై కిమ్ తీవ్రంగా విమర్శలు చేశారు.
అయితే కిమ్ ఎక్కడ ఉన్నాడనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు.
మరోవైపు ఉత్తర కొరియాతో అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసింది. అయితే అమెరికా ఇరాన్ పై దాడులు జరిపిన తరహాలోనే తనపై దాడి చేస్తారని కిమ్ భయపడుతున్నారని ఓ అంతర్జాతీయ నిఘా సంస్థ రిపోర్ట్ తెలిపింది. జనరల్ సోలేమనీ హత్యపై ఇప్పటివరకు ఉత్తరకొరియా కిమ్మనకుండా ఉంది.

0 Comments:
Post a Comment