రెండు రోజుల బ్యాంకు సమ్మె.. ఎప్పుడంటే...
దిల్లీ: దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో తమ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో తాము సమ్మె చేయనున్నామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో బ్యాంకులు సమ్మె నిర్వహించటం ఇది రెండోసారి. జనవరి 8న భారత్ బంద్ సందర్భంగా బ్యాంకులు సమ్మెలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
సమ్మె ఎందుకు?
తొమ్మిది ప్రభుత్వ బ్యాంకు యూనియన్ల సమాఖ్య అయిన యూఎఫ్‌బీయూ.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో వేతన సంబంధ అంశాలపై సోమవారం చర్చలు జరిపింది. వేతనాలలో 20 శాతం పెరుగుదల, మూలవేతనంతో ప్రత్యేక భత్యాన్ని ఏకం చేయటం, ఐదు రోజుల పనిదినాల విధానం వంటి అంశాలను యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కూడా వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో మార్చి 11 నుంచి 13 వరకు మరోసారి సమ్మెకు దిగాలని భావిస్తున్నారు. అప్పటికీ వేతనాలు పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేయటానికి సిద్ధమౌతున్నారు.
తేదీలు కీలకం
జనవరి 31న పార్లమెంటులో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అంతే కాకుండా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికపరంగా కీలకం కానున్న ఆ రెండు రోజులలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఈ రెండు రోజుల్లో సమ్మెతో దేశ ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

0 Comments:
Post a Comment