అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న రైతులు.. రేపటినుంచి సకలజనుల సమ్మెకు సిద్దమవుతున్నారు. తుళ్లూరులో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి సకలజనుల సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. నిత్యావసరాలు,ఎమర్జెన్సీ మినహా మిగతా కార్యాలయాలన్నీ మూసివేయాలని నిర్ణయించారు. శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో.. సకలజనుల సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.
అలాగే కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కూడా లేఖలు రాస్తున్నారు. తద్వారా అమరావతి రాజధాని అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి అనుగుణంగానే నివేదిక ఇవ్వబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించనట్టుగానే బోస్టన్ గ్రూప్ కూడా రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉందన్న విషయాన్ని నివేదికలో వెల్లడించబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నివేదికల సంగతెలా ఉన్నా.. వైసీపీ నేతల మాటలు మాత్రం విశాఖలోనే రాజధాని ఏర్పాటు అంశాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తలపెట్టబోతున్న సకలజనుల సమ్మె ప్రభుత్వంపై ఎంత మేర ఒత్తిడి పెంచుతుందో వేచి చూడాలి.

0 Comments:
Post a Comment