అంత పెద్ద అపార్ట్‌మెంట్లను ఎందుకు కూల్చేశారు?
మరడు.. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఒక పట్టణం.. కొన్ని రోజుల క్రితం వరకు ఈ పట్టణం పేరు అక్కడి వారికి మాత్రమే తెలుసు.. కానీ పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాల కూల్చివేతతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు తేలడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీటిని కూల్చివేశారు.
కొచ్చికి సమీపంలో..
కొచ్చికి కేవలం 7 కి.మీ. దూరంలో ఉండటంతో మరడులో రియల్‌ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఈ గ్రామపంచాయితీని 2010లో పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. వెంబనాడ్ సరస్సు సమీపంలో ఉన్న ప్రాంతంలో నాలుగు కంపెనీలకు అపార్ట్‌మెంట్లు కట్టేందుకు 2006లో పంచాయతీ అనుమతులు మంజూరు చేసింది. అయితే తీరప్రాంతంలో నిర్మాణాలకు కేరళ తీరప్రాంత అథారిటీ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అయితే నిర్మాణసంస్థలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. 2010 కల్లా కాంప్లెక్స్‌లు పూర్తి కాగా కొనుగోలు చేసినవారు అందులో చేరారు.
నిబంధనలు ఉల్లంఘించడంతో..
తీరప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘనలపై కేరళ తీర ప్రాంత అథారిటీ స్పందిస్తుంది. పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మూడో జోన్‌కి వస్తుంది. అంటే తీరం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీంతో వారి ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థలకు పంచాయతీ నోటీసులు జారీ చేసింది. 2007లో నిర్మాణసంస్థలు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి. 2012లో పంచాయతీ జారీ చేసిన నోటీసును కొట్టివేశారు.దీంతో కేరళ తీరప్రాంత అథారిటీ వారు సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళారు.
నిపుణులతో కమిటీ..
గత ఏడాది ఈ అంశంపై ఒక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. మరడు పంచాయతీ చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా అన్నఅంశంపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీలో కలెక్టర్ సభ్యులుగా ఉన్నారు. అనంతరం వారు సాంకేతిక కమిటీని నియమించగా పంచాయతి అనుమతులు ఇవ్వడంతో నిబంధలను ఉల్లంఘించిందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశం..
ఈ ఏడాది మే 8న పంచాయతి ఇచ్చిన అనుమతులు చెల్లవని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటిని కూల్చివేయాలని ఆదేశించింది. దీంతో కేరళ అధికార యంత్రాంగం అన్ని రకాల జాగ్రతలు తీసుకొని యంత్రిత అంతస్ఫోటన విధానం ద్వారా కూల్చివేశారు. ఈ భవనాల్లో నివాసముంటున్న వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం అందజేశారు. ఈ భవనాలు తీరానికి 20 మీటర్ల లోపలే ఉండటం గమనార్హం.
ఇంకా అనేక అక్రమ నిర్మాణాలు..
కేరళ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో నిర్మాణసంస్థలు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వెంబనాడ్ సరస్సు కొట్టాయం, అళప్పుళ, ఎర్నాకుళం జిల్లాల్లో విస్తరించివుంది. నదులు ప్రవహించే ప్రదేశాల్లో కాంక్రీటునిర్మాణాలు, అక్రమ క్వారీలు, ఇసుక తవ్వకాలతో పర్యావరణం తీవ్రంగా నష్టపోయిందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు.

0 Comments:
Post a Comment