‘అమ్మ ఒడి’ నిధుల విడుదలకు అనుమతులు
‘
అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధుల విడుదలకు పాలనా అనుమతులు మంజూరయ్యాయి. వివిధ శాఖల నుంచి ఈ పథకానికి రూ.6,109 కోట్ల నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. బీసీ కార్పోరేషన్ నుంచి రూ.3,432 కోట్లు, కాపు కార్పోరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖ నుంచి రూ.442 కోట్లు, గిరిజనశాఖ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.395 కోట్లు, ఎస్సీ కార్పోరేషన్ నుంచి రూ.1,271 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ పథకం కింద 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో సంబంధం లేకుండా కనీసం 75శాతం హాజరు ఉన్న ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం వర్తించనుంది.

0 Comments:
Post a Comment