విదేశాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయులకు బంపర్ ఆఫర్. ఈ 58 దేశాల్లో వీసా లాంఛనాలు లేకుండానే పర్యటించవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఏ ప్రాంతాన్ని అయినా పర్యటించాలంటే వీసాలతో చాలా చిక్కులు ఎదురువుతుంటాయి. కానీ, ఇప్పుడు వీసా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
టాప్ ర్యాంకులో జపాన్.. 84వ ర్యాంకులో భారత్ :
ఇండియన్ పాస్ పోర్టు ఇప్పుడు చాలా పటిష్టంగా మారింది. దీంతో చాలా దేశాలు ఇప్పుడు భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఇస్తున్నాయి. హెన్లే పాస్ పోర్ట్ సూచిక 2020 డేటా ప్రకారం.. ప్రపంచ పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో భారతీయ పాస్ పోర్టు 84వ ర్యాంకులో నిలిచింది.
ఈ జాబితాలో జపాన్ పాస్ పోర్ట్ టాప్ ర్యాంకులో నిలిచింది. ఎందుకుంటే జపాన్ పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ కింద 191 దేశాలు అనుమతి ఇస్తున్నాయి.
అదేవిధంగా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్టులు సైతం చాలా పటిష్టంగా ఉండటంతో ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు వీసా-ఫ్రీ ఎంట్రీలకు ఆమోదం తెలిపాయి. దక్షిణ ఆసియాలో ఇండియా టాప్ ర్యాంకులో నిలిచింది. ఎలాంటి వీసా లాంఛనాలు లేకుండానే ఈజీగా ప్రపంచంలోని 58 దేశాలకు హాయిగా పర్యటించవచ్చు.
15 రోజుల ఉచిత e-visa :
అంతేకాదు.. భారతీయ పాస్ పోర్టుదారులు మలేసియా, యూనైటెడ్ ఎమిరేట్స్ దేశాలకు 15 రోజుల ఉచిత ఆన్ లైన్ వీసాను కూడా పోందవచ్చు. కానీ, చాలా దేశాల్లో మాత్రం, భారతీయులు పర్యటించాలంటే తమ ప్రయాణ సమయం నుంచి కనీసం 6 నెలల్లో పాస్ పోర్టు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలి. వీసా ఆన్ అరైవల్ తప్పనిసరిగా అయిన విదేశాలకు వెళ్లే భారతీయులంతా తమ వెంట పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్, Confirmed రిటర్న్ టికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
కానీ, కొన్ని దేశాల్లో మాత్రం.. భారతీయులు ఎంట్రీ ఫీజు చెల్లించడంతో పాటు ఒక అప్లికేషన్ ఫాం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడ ఉండబోతున్నారు.. ఎంతమొత్తంలో నగదు ఉందో కూడా ప్రూఫ్ గా చూపించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment