వాల్‌నట్స్ ప్రతి రోజు తీసుకుంటే గుండె పనితీరు బాగుంటుందంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. బీపీ, హుద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి వాల్‌నట్స్ ఆహారంలో భాగం చేయగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఇందులో ఉన్న పీచు, బయోయాక్టివ్ పదార్ధాలు బీపీని తగ్గించి గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వారు కూడా గుండెకు సంబంధించిన ఏ సమస్యలు లేకపోయినా ప్రతి రోజు వాల్‌నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే భవిష్యత్‌లో వచ్చే గుండె సమస్యలను నివారించవచ్చు.
వాల్ నట్స్.. అచ్చం రాళ్లను పోలి ఉంటాయి. కానీ ఇవి మనకు అందించే లాభాలు మాత్రం అనేకం. వీటిని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందడమే కాక అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నియంత్రణకు వాల్ నట్స్ బాగా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో వాల్ నట్స్ ఔషధంలా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు వీటిల్లో అధికంగా ఉంటాయి. దీంతో వివిధ అనారోగ్యాలు రాకుండా అడ్డుకోవచ్చు. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు, మినరల్స్ వీటిలో ఉంటాయి. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాల్ నట్స్ బాగా పనికొస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను ఇవి తగ్గిస్తాయి. దీంతోపాటు రక్తనాళాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.
3. రొమ్ము క్యాన్సర్ రాకుండా వాల్ నట్స్ కాపాడతాయి. వివిధ రకాల ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉండడమే ఇందుకు కారణం. రోజుకో కప్పు వాల్ నట్స్‌ను తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
4. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు వాల్ నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. గుండె, దాని సంబంధ వ్యవస్థలను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీ కూడా అదుపులోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
5. గర్భిణీ మహిళలు వాల్ నట్స్‌ను రోజూ తీసుకుంటే పిండం పెరుగుదలకు అది తోడ్పడుతుంది. శిశువు ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. నెలలు నిండకుండానే జరిగే ప్రసవాన్ని ఇవి అడ్డుకుంటాయి.
6. వారంలో కొన్ని రోజుల పాటు నిత్యం వాల్ నట్స్‌ను తీసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం 25 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
7. వారంలో రెండు రోజులు వాల్ నట్స్‌ను తిన్నా అది బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. వెంట్రుకల పెరుగుదలకు కూడా వాల్ నట్స్ పనికొస్తాయి.
8. ఒత్తిడిని తగ్గించడంలో వాల్ నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు వీటిని నిత్యం తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్థం నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇవి జ్ఞాపకశక్తిని కూడా వృద్ధి చేస్తాయి.
9. డైటరీ ఫైబర్ వీటిలో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడంతోపాటు జీర్ణప్రక్రియను కూడా మెరుగు పరుస్తుంది. చర్మాన్ని సంరక్షించే విటమిన్ ఇ వంటి పోషకాలు వాల్ నట్స్‌లో ఉన్నాయి.
10. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. డిప్రెషన్, అల్జీమర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రాన్స్ డిసీజ్ వంటి వాటిని తగ్గించడంలో వాల్ నట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

0 Comments:
Post a Comment