Telangana CET Schedule: తెలంగాణ ఎంసెట్, ఐసెట్ తేదీల విడుదల
తెలంగాణలో 2020 సంవత్సరంలో నిర్వహించే వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-CET షెడ్యూల్‌ను విడుదల చేశారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి. మే నుంచి సెట్స్ జరగనున్నాయి. మే 2న ఈసెట్, మే 5, 6, 7 తేదీల్లో ఎంసెట్, మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ సెట్ జరగనుంది. మే 13 నుంచి మూడు వారాల పాటు పీఈ సెట్ నిర్వహించనున్నారు. మే 20, 21 తేదీల్లో ఐసెట్, మే 23న ఎడ్‌సెట్ నిర్వహిస్తారు. ఒకవేళ ఎడ్‌సెట్ అభ్యర్థులు ఎక్కువగా ఉంటే మే 24న కూడా పరీక్ష జరగనుంది. మే 25 నుంచి లాసెట్, మే 27 నుంచి 30 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరుగుతాయి. మే నెలలో అన్ని ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎంసెట్, ఈసెట్, ఐసెట్ లాంటి పరీక్షల తేదీలను నిర్ణయించింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి.
ఇక గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలపై ఫీజుల నియంత్రణ లేదని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. వాటిలో ఫీజు రీఇంబర్స్‌మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. వీసీల నియామక ప్రక్రియ జరుగుతున్నట్టు తెలిపారు. అన్ని సెట్స్ మేలోనే జరుగుతాయి. జూన్ 15 వరకు ఫలితాలు విడుదల చేసి జులై లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు ప్రకటించారు. ఎప్పటిలాగే నిమిషం లేట్ అయినా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈసారికి ఫీజుల్లో ఎలాంటి పెంపు లేదని వెల్లడించారు పాపిరెడ్డి.

0 Comments:
Post a Comment