రిటర్న్‌లు సమర్పించకుంటే ఏమవుతుంది..?
బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల జప్తు
దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు
జీఎస్‌టీ వసూళ్లు నెలనెలా తగ్గుతూనే ఉన్నాయి’.. కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట ఇది. జీఎస్‌టీ వసూళ్లు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. రిటర్న్‌ల దాఖలు చేయని వారి సంఖ్య పెరుగుతుండటమే. ఈ పరిణామంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే వసూళ్లు పెంచేందుకు వివిధ చర్యలు చేపడుతున్నాయి. రిటర్న్‌లు దాఖలు చేయని వారి సంఖ్య మరింత పెరిగితే.. కఠిన చర్యలు చేపట్టడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం. రిటర్న్‌లు దాఖలు చేయకుంటే పన్ను ఎగవేతదార్ల చేతిలోనే ప్రభుత్వ ఆదాయం ఉండిపోతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. చట్టవిరుద్ధం కూడా. ఈ ఆదాయం ప్రభుత్వానికే వెళ్తుంది కదా అని అనుకుంటే పొరపాటే.. ఆ డబ్బు దేశ పౌరులందరిదీ అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
రిటర్న్‌లు దాఖలు చేయకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన నిబంధనలు జీఎస్‌టీ చట్టంలో ఉన్నాయి. ఈ నిబంధనలను వర్తిపంచేసే విషయంలో దేశమంతా ఒకే విధానాన్ని జీఎస్‌టీ అధికారులు పాటించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా అందరూ ఒకే విధానాన్ని అనుసరించేలా ఇటీవలే సెంట్రల్ ట్యాక్స్ సర్క్యులర్ సంఖ్య: 129/48/2019; తేదీ 24/12/2019ను కేంద్రం జారీ చేసింది.
ఈ సర్క్యులర్‌లోని వివరాల్లోకి వెళ్లడానికి ముందు అసలు జీఎస్‌టీ రిటర్న్‌లు దాఖలు చేయనివారికి సంబంధించి చట్టంలో ఉన్న నిబంధనలేమిటో చూద్దాం. తదుపరి సర్యులర్‌లో నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చూద్దాం.
ఏ నిబంధన.. ఎందుకు
* సెక్షన్ 46, సీజీఎస్‌టీ చట్టం, 2017
నెలవారీ రిటర్న్‌లు, వార్షిక రిటర్న్‌లు, తుది రిటర్న్‌లు... వీటిల్లో ఏ తరహా రిటర్న్‌నైనా దాఖలు చేయకుంటే ఆ వ్యక్తి లేదా సంస్థకు నోటీసులు జారీ చేసే అధికారాన్ని అధికారులకు ఈ సెక్షన్ కల్పించింది.
* సెక్షన్ 62, సీజీఎస్‌టీ చట్టం, 2017
సెక్షన్ 46 కింద నోటీసులు జారీ చేసినప్పటికీ పన్ను ఎగవేతదార్లు రిటర్న్‌లు దాఖలు చేయకుంటే అసెస్‌మెంట్ ఆర్డరును జారీ చేసే అధికారాన్ని అధికారులకు ఈ సెక్షన్ కల్పించింది.
* సెక్షన్ 83, సీజీఎస్‌టీ చట్టం, 2017
ఓ వైపు సెక్షన్ 62 ప్రకారం ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ఆదాయ పరిరక్షణకు గాను బ్యాంకు ఖాతా సహా స్థిరాస్తులను ఈ సెక్షన్ కింద జప్తు చేసే అధికారం కమిషనర్‌కు ఉంటుంది.
* సెక్షన్ 29, సీజీఎస్‌టీ చట్టం, 2017
సీజీఎస్‌టీ చట్టం, 2017లోని సెక్షన్ 29(2)లో నిర్దేశించిన ప్రత్యేక అంశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం ఈ సెక్షన్ కింద సంబంధిత అధికారికి ఉంటుంది.
* జీఎస్‌టీఆర్- 3ఏ ఫారం
నెలవారీ లేదా తుది రిటర్న్‌లు దాఖలు చేయనందుకు సెక్షన్ 46 కింద పన్ను ఎగవేతదార్లకు జారీ చేసే నోటీసు విధానం (ఫార్మాట్) ఇది.
* ఏఎస్‌ఎమ్‌టీ- 13
నెలవారీ లేదా తుది రిటర్న్‌లు దాఖలు చేయనందుకు సెక్షన్ 62 కింద ఇచ్చే అసెస్‌మెంట్ ఆర్డరు విధానం (ఫార్మాట్) ఇది.
ప్రక్రియ సాగాలి ఇలా..
సెంట్రల్ ట్యాక్స్ సర్క్యులర్ సంఖ్య: 129/48/2019; తేదీ: 24-12-2019 ప్రకారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈ కింది విధంగా ఉంటుంది. రిటర్న్‌లు దాఖలు చేయని వారితో దేశవ్యాప్తంగా అధికారులు దీని ప్రకారంగానే వ్యవహరించాల్సి ఉంటుంది.
రిటర్న్‌లు సమర్పించకుంటే ఏమవుతుంది..?
* ఎస్‌ఎమ్‌ఎస్
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తుల మొబైల్‌కు ,రిటర్న్‌ల దాఖలు గడువు తేదీకి 3 రోజుల ముందు ఎస్‌ఎమ్‌ఎస్‌ను పంపిస్తారు. గడువు తేదీని గుర్తు చేయడమే దీని వెనుక ఉద్దేశం.
* సిస్టమ్ జనరేటెడ్ మెయిల్
ఎవరైతే నిర్దిష్ట గడువు తేదీ లోపు రిటర్న్‌లు దాఖలు చేయనివారుంటారో.. వాళ్లకు గడువు తేదీ తర్వాత వెంటనే సిస్టమ్ జనరేటెడ్ మెయిల్‌ను.. మెసేజ్ పంపిస్తారు.
* జీఎస్‌టీఆర్-3ఏ నోటీసు
నెలవారీ లేదా తుది రిటర్న్‌లను ఎవరైతే దాఖలు చేయలేదో వారికి గడువు తేదీ ముగిశాక ఐదు రోజులకు సంబంధిత అధికారుల నుంచి జీఎస్‌టీఆర్-3ఏ ఫారంలో నోటీసు వస్తుంది. రిటర్న్‌ల దాఖలును ఆలస్యం చేసినందుకు వడ్డీతో కలిపి 15 రోజుల్లోగా రిటర్న్‌లు దాఖలు చేయాల్సిందిగా ఇందులో ఆదేశిస్తారు. ఒకవేళ ఈ సమయంలోపు వడ్డీతో కలిపి రిటర్న్‌లు దాఖలు చేస్తే.. జీఎస్‌టీఆర్-3ఏ రూపంలో ఇచ్చిన నోటీసును ఉపసంహరిస్తారు.
* ఏఎస్‌ఎంటీ- 13.. అసెస్‌మెంట్ ఆర్డరు
పైన పేర్కొన్న మూడు చర్యల తర్వాత కూడా రిటర్న్‌లు దాఖలు చేయకుంటే జీఎస్‌టీఆర్-1, జీఎస్‌టీఆర్-2ఏ, ఇ-వేబిల్లు, ఇతరత్రా సమాచారం ఆధారంగా మదింపు చేసి సంబంధిత అధికారి ఏఎస్‌ఎంటీ-13 ఫారం జారీ చేస్తారు. ఏఎస్‌ఎంటీ-13 ఫారం జారీ చేశాక.. 30 రోజుల తర్వాత పన్ను, వడ్డీ, జరిమానా వసూలు నిమిత్తం అధికార్లు చర్యలు చేపడతారు. ఒకవేళ ఈ 30 రోజుల్లోగా ఆ వ్యక్తి రిటర్న్‌లు దాఖలు చేస్తే ఏఎస్‌ఎంటీ-13 రూపంలో ఇచ్చిన మదింపు ఆదేశాలు ఉపసంహరణకు గురవుతాయి.
* తాత్కాలిక జప్తు
ఒకవైపు పైన పేర్కొన్న చర్యల సమయంలో ఆదాయ పరిరక్షణ నిమిత్తం పన్ను బకాయిదార్ల బ్యాంకు ఖాతాలు సహా ఆస్తులను కమిషనర్ తాత్కాలికంగా జప్తు చేస్తారు.
* రిజిస్ట్రేషన్ రద్దు
సెక్షన్ 29 ప్రకారం రిటర్న్‌లు దాఖలు చేయకుంటే ఒక రిజిస్టర్డ్ వ్యక్తి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం సంబంధిత అధికారికి ఉంటుంది.
ముగింపు
మదింపు, పన్ను బకాయిల వసూలు, రిజిస్ట్రేషన్ రద్దు చేసే నిమిత్తం అధికారులకు తగినన్ని అధికారాలను జీఎస్‌టీ చట్టం కల్పించింది. సాంకేతికత, పారదర్శకత పెరిగిన ప్రస్తుత తరుణంలో చట్టాలను పాటించడం మంచిది. లేదంటే అనవసరమైన శిక్షను ఎదుర్కోవల్సిన పరిస్థితి నెలకొంటుంది. అసలు కట్టాల్సిన పన్ను బకాయి కంటే.. పన్ను ఎగ్గొట్టడం వల్ల చెల్లించాల్సి వచ్చే భారం ఎక్కువగా ఉంటుంది.

0 Comments:
Post a Comment