Sri Chathurmukha Brahmalingeshwara Swamy Temple of Brahma
ఆంధ్రప్రదేశ్ లోని అతి ప్రాచీన ఆలయం - శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి
మీకు తెలుసా ? పురాతన బ్రహ్మ దేవుని ఆలయాలలో ఒకటి మన నవ్యాంధ్ర(ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్రంలో ఉందని ? అసలు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో ... ఆ ఆలయం పూర్వాపరాలు ఏమిటో ఇదిగో ఇక్కడ చదవండి.
గుంటూరు నుండి తెనాలి వెళ్లే దారిలో చేబ్రోలు అనే గ్రామం ఉంది. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి సుమారుగా అటుఇటు 32 కి. మీ. దూరంలో ఉండి గంటలో చేరుకొనే విధంగా ఉంటుంది. ఈ చేబ్రోలు గ్రామం ఇక్కడున్న బ్రహ్మ ఆలయం తో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం గుంటూరు జిల్లాలో నే కాక రాష్ట్రంలోనే పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. ఈ ఆలయ ప్రాంగణంలో రెండువేల సంవత్సరాల క్రితం అనగా క్రీ. శ. 14 వ శతాబ్ధంలో నిర్మించిన ఆలయాలు సైతం ఉన్నాయి. ఆ ఆలయం కోనేరు మధ్యలో నిర్మించబడి, నాలుగువైపులా శివ, విష్ణు,శక్తి దేవాలయాలతో అలరారుతుంది.
ఇక్కడి స్థల పురాణం,విశేషాలు పరిశీలిస్తే ...
స్థల పురాణం
భృగు మహర్షి " బ్రహ్మకు ఎక్కడా పూజింపబడవని " ఇచ్చిన శాపం కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు. కానీ రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం , కాశీ లో ఒక ఆలయం, ఇక్కడ మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చేబ్రోలు ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మ కు ఆలయాలు ఉన్నాయి.
విశేషాలు
ఇక్కడ ఉన్న ఆలయం బ్రహ్మ దేవునికి ఉన్న అతి కొద్ది ఆలయాలలో ఒకటి. బ్రహ్మకు ప్రత్యేక రూపం లేక శివలింగం రూపంలోనే, నాలుగువైపులా అందంగా చెక్కబడిన నాలుగు బ్రహ్మ ముఖాలతో దర్శనమిస్తాడు.
శిల్ప సంపద
కాలగర్భంలో ఎన్నో ఆలయాలు భూమిలో కలిసిపొయినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభవాన్ని చాటిచెప్పే దేవాలయాలింకా ఇక్కడ ఉన్నాయి. పల్లవ, చాళుక్యుల, చోళుల శిల్ప కళా వైభవానికి ఇక్కడి ఆలయాలు వేదికగా ఉన్నాయి.
బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం
సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పు న వంతెన నిర్మించారు.
గర్భగుడి
ఇక ఆలయ గర్భగుడి విషయానికి వస్తే, నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగుల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగుల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు.
మరో 9 ఆలయాలు...
బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయసముదాయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్రహమూర్తులు, నాగేశ్వరాలయాలు, ఒక నంది విగ్రహం పక్కపక్కనే ఉన్నాయి.
ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ... బ్రహ్మ చూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.
భీమేశ్వర ఆలయం
క్రీ.శ. రెండవ శతాబ్ధంలో నిర్మించారని భావిస్తున్న బీమేశ్వర ఆలయానికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి. ఇక్కడే పన్నెండడుగుల నటరాజ విగ్రహం కూడా ఉండేదట..!
చేబ్రోలు ఎలా చేరుకోవాలి ??
విమాన మార్గం చేబ్రోలు కు 62 కి. మీ. దూరంలో గల విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల మీద చేబ్రోలు కి చేరుకోవచ్చు. రైలు మార్గం చేబ్రోలులో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి విజయవాడ, గుంటూరు వంటి దగ్గరి నగరాలకు ప్రయాణించవచ్చు. లేకుంటే 32 కి. మీ. దూరంలో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్ లో గాని, 60 కి. మీ. దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో గాని దిగి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం విజయవాడ, గుంటూరు వంటి నగరాల నుండి బస్సులు చేబ్రోలు కి వస్తుంటాయి. గుంటూరు బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. తెనాలి నుండి కూడా చేబ్రోలు కి బస్సులో ప్రయాణించవచ్చు.
ఇటువంటి అద్భుత కళాఖండాలను, కనుమరుగైన సంస్కృతి - సంప్రదాయాలను గుర్తుకు తెప్పించే ఈ చేబ్రోలు (101 గుడులు) ను పరిరక్షించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం

0 Comments:
Post a Comment