Social Media scan - సోషల్ మీడియాపై స్కాన్... వివాదాస్పద పోస్టులు పెడితే... చిక్కులే..
Social Media : నెటిజన్లూ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కడైనా, ఏదైనా విపరీతం జరిగితే... ఆవేశంగా మీ ఆక్రోశాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టకండి. ఉరితీస్తేస్తా, అంతుచూస్తా అంటూ, నాకు అప్పగించండి... వంటి పదాలతో పోస్టులు పెడుతున్నట్లైతే... మీరు ఓసారి ఆలోచించుకోవడం మంచిది. మనం ఏం చేసినా చట్టపరిధిలో చెయ్యాల్సిందే. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలోనూ సైబర్ క్రైమ్ రూల్స్‌ని కచ్చితంగా పాటించాలంటున్నారు పోలీసులు. ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టిక్ టాక్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియా యాప్స్, వెబ్‌సైట్లపై పోలీసులు ఫుల్ నిఘా పెడుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వ్యక్తి వివాదాస్పద కామెంట్ చేసినా...
పోలీసులు ఇట్టే కనిపెట్టేయగలరు. పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే దాని సంగతి తేల్చేస్తారు. ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచీ పెట్టారు, అన్ని వివరాలూ పోలీసులకు తెలిసిపోతాయి. ఆ తర్వాత అరెస్టులే. దిశ హత్యాచారం కేసు దృష్ట్యా సోషల్ మీడియాపై స్కానింగ్ ఎక్కువైంది. ఇప్పటికే తాజాగా ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు. వాళ్లిద్దరూ కూడా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టినవాళ్లే.
ఎక్కడో నోటికొచ్చింది వాగితే దానికి ఆధారం ఉండకపోవచ్చేమోగానీ... సోషల్ మీడియాలో అలా కాదు. పోస్ట్ పెడితే చాలు అదే ఆధారం. తర్వాత దాన్ని డిలీట్ చేసేసినా... ఆయా వెబ్‌సైట్లలో అది డిలీటైనట్లు చూపిస్తున్నా... ఆ సంస్థ సర్వర్‌లో వివరాలుంటాయి. కాబట్టి అడ్డమైన పోస్టులు పెట్టేవాళ్లు దొరకకుండా తప్పించుకోవడం అసాధ్యం. జైలు కెళ్లడం ఖాయం. తప్పించుకోగలం అనే ఆలోచనే భ్రమ.
హైదరాబాద్‌లోని రాయదుర్గంకి చెందిన ఓ మహిళా డాక్టర్ ఫేస్‌బుక్ పేజీలో ఓ మహిళ పెట్టిన పోస్టుపై ఓ కుర్రాడు అసభ్య కామెంట్ పెట్టాడు. ఆ మహిళా డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నల్గొండలోని గుండ్రాలవల్లిలో ఆ కుర్రాణ్ని అరెస్టు చేశారు. ఇలాగే గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ కూడా అరెస్టయ్యాడు. అతను కూడా మహిళలపై చెత్త పోస్టులు పెట్టినవాడే.భావప్రకటనా స్వేచ్ఛ అనేది హద్దుల్లో ఉండటమే మంచిది. స్వేచ్ఛ పేరుతో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. అందువల్ల నెటిజన్లు రూల్స్ పాటించడం మేలు..

0 Comments:
Post a Comment