చొక్కా గుండీతో నిందితులను పట్టేశారు!
ఔరంగాబాద్: చొక్కా గుండీ ద్వారా హత్య కేసు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఏడు నెలల క్రితం భికన్ నిలోబ జాదవ్ అనే వ్యక్తిని కొందరు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో కేవలం చొక్కా గుండీ మాత్రమే లభించింది. ఎటువంటి ఆధారాలూ లభించలేదు. దీంతో ఆ బటన్ ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు.
మే 12న జాదవ్‌ను దోచుకొని అతడిని హత్య చేశారు. ఘటనా స్థలిలో దొరికిన గుండీపై ‘రోప్ లాస్ట్ స్టిచ్’ అని రాసి ఉంది. అటువంటి బటన్ ఉండే షర్టులను ఎవరెవరు కొనుగోలు చేశారనే విషయాన్ని ఆన్‌లైన్ విక్రేతల వద్ద ఆరా తీశారు. దాదాపు 10వేల మంది అటువంటి చొక్కాలను కొనుక్కున్నట్లు తేలింది. వారిలో నేరచరిత్ర ఉన్న 246 మంది పేర్లను బయటకు తీశారు. అందులో రగాడే అనే వ్యక్తి హత్య జరగడానికి నాలుగు రోజుల ముందు రెండు కత్తులను కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మిగతా నిందితుల వివరాలు తెలిసిపోయాయి. అజయ్ రగాడే, చేతన్ అశోక్ గైక్వాడ్, సందీప్ గైక్వాడ్ ఈ హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితులను పట్టుకునే విషయంలో తెలివిగా వ్యవహరించిన పోలీసులకు రూ.30వేల నగదు బహుమతిగా ఇచ్చినట్లు ఔరంగాబాద్ జిల్లా సూపరింటెండెంట్ మోక్షద పాటిల్ తెలిపారు. నిందితులను పట్టుకునే క్రమంలో ఏకంగా ఐదు రాష్ట్రాల్లో పోలీసులు జల్లెడ పట్టారు.

0 Comments:
Post a Comment