రోడ్డెక్కిన చదువులు
పాఠశాల భవనం లేకపోవడంతో రోడ్డుపైనే చదువులు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం చినదుంగాడలోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో సెప్టెంబరులో మండల అధికారులు భవనాన్ని ఖాళీ చేయించారు. అప్పటి నుంచి స్థానిక చర్చిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చి ఖాళీగా లేకపోవడంతో విద్యార్థులను వేరే స్థలానికి తీసుకువెళ్లేందుకు ఉపాధ్యాయులు నిర్ణయించారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికారులు స్పందించే వరకు పిల్లలను రోడ్డుపైనే పాఠాలు బోధించాలని పట్టుబట్టారు. దీంతో రోడ్డుపైనే తరగతులు నిర్వహించారు. స్థానిక పెద్దలు సమీపంలోని సామాజిక వేదికను శుభ్రం చేసి అప్పగించడంతో అక్కడ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు.
0 Comments:
Post a Comment