ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి మరియు క్రిస్మస్ సెలవుల షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు జనవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఉంటాయి. అలాగే మిషనరీ పాఠశాల విద్యార్థులకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. సెలవుల వివరాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్ లో ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కళాశాలలకు జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో పేర్కొంది.
0 Comments:
Post a Comment