శనగలు.. మనం వీటిని వంటల్లో ఎక్కువగా వాడుతాం. పొట్టు తీయని శనగలను గుగ్గిళ్లలా వేసుకుని కొందరు తింటారు. కొందరు వేపుకుని ఉప్పు, కారం చల్లి తింటారు. ఇంకొందరు కూరల్లో వేస్తారు. అయితే పొట్టు తీయని శనగలను అప్పుడప్పుడు తినే కంటే రోజూ తింటేనే ఎక్కువగా ప్రయోజనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో రోజూ ఒక కప్పు ఉడకబెట్టిన శనగలను తిన్నా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
2. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో గుండె జబ్బులు రావు.
అధిక బరువు తగ్గుతారు.
3. మాంసాహరం తినని వారికి శనగలు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే మాంసాహారం కన్నా శనగల్లోనే ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. దీంతో శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.
4. శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి.
5. ఒక కప్పు శనగలను ఉడకబెట్టుకుని రోజూ తింటే రక్తం కూడా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు తయారవుతాయి.
6. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మంచి మూడ్‌లోకి వస్తారు. డిప్రెషన్ పోతుంది. సరిగ్గా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యలు పోతాయి.
7. ఐరన్, ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. దీంతో రోజంతా శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గవు. ఉత్సాహంగా ఉంటారు.
8. శనగల్లో పాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపుతుంది. దీంతో కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి.
9. పచ్చ కామెర్లు, లివర్ వ్యాధులు ఉన్న వారు శనగలను తింటే ఆ వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు.
10. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. పిల్లలకైతే ఎముకలు బాగా పెరుగుతాయి.

0 Comments:
Post a Comment