పే..ద్ద ఉప్పు కొండ!
చుట్టూ వాతావరణం చూస్తే చలికాలంలా కూడా లేదు. కానీ మధ్యలో అంత పెద్ద మంచుకొండ ఎలా వచ్చిందీ అనిపిస్తోంది కదూ ఈ చిత్రాన్ని చూస్తుంటే. కానీ మనం వూహించినట్లు ఇది మంచుకొండ కాదు. జర్మనీలోని హెరింగర్ పట్టణంలో ఉన్న మాంటెకాలి ఉప్పుకొండ. దీన్లో ఉన్నదంతా మనం వంటల్లో వాడే ఉప్పే(సోడియం క్లోరైడ్). ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి పొటాష్ గనిని తవ్వినపుడు పొటాష్‌తో పాటు సోడియం క్లోరైడ్ కూడా వస్తుంది. దాన్ని పొటాష్ నుంచి వేరుచేసి దగ్గరలో గుట్టలుగా పోస్తున్నారు. కాకపోతే పూర్తిస్థాయిలో శుద్ధిచేయడం సాధ్యం కాదు కాబట్టి ఇది తినడానికి పనికిరాదు. అలా గత నూట పదేళ్లుగా పోగైన ఉప్పుతో 93 హెక్టార్ల విస్తీర్ణంలో 200 మీటర్ల ఎత్తుకు పెరిగింది ఈ ఉప్పుకొండ. అందుకే, దీన్ని స్థానికులు జర్మనీ దేశపు కిలిమంజారోగా పిలుచుకుంటారు.

0 Comments:
Post a Comment