వారంలో ప్రజారవాణా శాఖ
ఏర్పాటుపై కసరత్తు ఒకటిన ఆర్టీసీ విలీనం
అధికారులకు కొత్త హోదాలు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంలో భాగంగా ఆ సంస్థ కార్మికులు ప్రజారవాణా శాఖలోకి మారనున్నారు. కొత్త శాఖ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జనవరి ఒకటిన అధికారంగా ఆర్టీసీ కార్మికులను అందులోకి మారినట్లు చూపనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించిన బిల్లుకు ఉభయసభలు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులివ్వనుంది. దీంతో కొత్త శాఖ ఏర్పాటు ఆరంభమవుతుంది. అనంతరం ఏపీఎస్‌ఆర్టీసీలోని 51,488 కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తారు.

0 Comments:
Post a Comment