వాషింగ్టన్: పర్యావరణ మార్పులు మనం తినే అన్నాన్ని మెల్లమెల్లగా విషంగా మార్చేస్తున్నాయా? వరి ధాన్యంలో హానికర ఆర్సెనిక్ మూలకం మోతాదును పెంచుతున్నాయా? అవుననే అంటున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ బియ్యంలో ఆర్సెనిక్ శాతం పెరుగుతున్నట్లు వారు తేల్చారు. మట్టిలో ఆర్సెనిక్ సహజంగానే ఉంటుంది. భూమి నుంచి పోషకాలను గ్రహించే ప్రక్రియలో ఆ మూలకాన్నీ మొక్కలు పీల్చుకుంటాయి. కాబట్టి వరి ధాన్యంలో దాని ఉనికి కొంత కనిపించడం సాధారణమే. తాజా అధ్యయనంలో భాగంగా పరిశోధకులు కాలిఫోర్నియాలోని డేవిస్‌లో (ఇక్కడి భూముల్లో ఆర్సెనిక్ తక్కువగా ఉంటుంది.) మట్టిని సేకరించారు.
0 Comments:
Post a Comment