*💠Ravana Rahasyam-రావణ రహస్యం...స్పెషల్ స్టోరీ...* ▪శ్రీలంక ప్రభుత్వం అనేక కమిటీలు ,పరిశోధనలు చేసి అధికార రాజముద్ర వేసి గుర్తించిన ప్రాంతాలు... ▪అశోక వాటిక రావణ గుహ సీతా జల హిమాలయ మట్టితో కూడిన రాముసోలా (సంజీవిని పర్వతం) అనే కొండ.. కెలీనియా (విభీషణుని రాజభవనం) సీతా గోళీలు *రావణ గుహ ....* *📸ఫొటోలతో కూడిన విశేషాలు....* *🎥రావణ గుహ దగ్గర షూట్ చేసిన , రావణ గుహ రహస్య వివరణ వీడియోస్...* ~ MANNAMweb.com

Search This Blog

Latest Posts ⚡ లేటెస్ట్ పోస్ట్స్

MORE TO VIEW

Sunday 29 December 2019

*💠Ravana Rahasyam-రావణ రహస్యం...స్పెషల్ స్టోరీ...* ▪శ్రీలంక ప్రభుత్వం అనేక కమిటీలు ,పరిశోధనలు చేసి అధికార రాజముద్ర వేసి గుర్తించిన ప్రాంతాలు... ▪అశోక వాటిక రావణ గుహ సీతా జల హిమాలయ మట్టితో కూడిన రాముసోలా (సంజీవిని పర్వతం) అనే కొండ.. కెలీనియా (విభీషణుని రాజభవనం) సీతా గోళీలు *రావణ గుహ ....* *📸ఫొటోలతో కూడిన విశేషాలు....* *🎥రావణ గుహ దగ్గర షూట్ చేసిన , రావణ గుహ రహస్య వివరణ వీడియోస్...*



 Photo courtesy : Ramanjaneyulu Patrika 















Ravana Rahasyam
రావణ రహస్యం - శ్రీలంక ప్రభుత్వం అనేక కమిటీలు ,పరిఅహోదనలు చేసి అధికార రాజముద్ర వేసి గుర్తించిన ప్రాంతాలు...- అశోక వాటిక, రావణ గుహ,సీతా జల,హిమాలయ మట్టితో కూడిన రాముసోలా (సంజీవిని పర్వతం) అనే కొండ..కెలీనియా (విభీషణుని రాజభవనం), సీతా గోళీలు , రావణ గుహ ....విశేషాలు...మీ కోసం..


రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం..
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు...
2
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...
3
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా..
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు..రా గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది..
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
4
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.

కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...

ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే  భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.

రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి.

హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో .............................
కాలమే సమాధానం.

రావణ గుహ...వీడియో

 రావణ రహస్యం వీడియో...తెలుగులో

1 comment:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top