రూ. 15 వేలు జరిమానా
ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న బైక్ చోదకుడు
సిగ్నల్ జంపింగ్‌లు, త్రిబుల్ రైడింగ్ కేసులు
రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు
యశవంతపుర: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన బైక్ చోదకుడిపై 71 కేసులు నమోదు కాగా జరిమానా రూ. 15 వేలు విధించిన సంఘటన బెంగళూరులో జరిగింది. గురువారం రాజాజీనగర ట్రాఫిక్ పోలీసులు మహలక్ష్మీ లేఔట్ శంకరనగర బస్టాండ్ వద్ద హెల్మెట్ లేకుండా వెళ్తున్న బైక్ చోదకుడు మంజును పోలీసులు ఆపారు. బైక్ నంబర్ కేఏ 41-ఇజి6244 ఆధారంగా అతడికి హెల్మెట్ లేని కారణంగా జరిమానా విధించాలని పోలీసులు పరిశీలించారు. జరిమానా రశీదు ఏకంగా రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు వచ్చింది.
0 Comments:
Post a Comment