దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త వినిపించింది. ఎంఎన్‌పీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి కస్టమర్ తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతుంది. అయితే డిసెంబర్ 16వ తేదీ నుంచి అమలు చేయనున్న ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం 3 రోజుల్లోనే ఎంఎన్‌పీ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో వినియోగదారులు ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ ద్వారా తమ ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయడం మరింత తేలికగానూ, వేగంగానూ అయిపోవడం విశేషం. కాగా ఒకే సర్కిల్ అయితే 2 రోజుల్లోనే నంబర్‌ను పోర్ట్ చేసుకోవచ్చని, వేరే సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్‌కు ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయాలంటే మాత్రం 5 రోజుల సమయం పడుతుందని ట్రాయ్ తెలిపింది.
0 Comments:
Post a Comment