ఆంధ్రప్రదేశ్‌లో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మెరుపు సమ్మెకు దిగారు. రేపటి నుంచి మీసేవ నిర్వాహకులు సమ్మె నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. 'మనం ప్రభుత్వానికి ఇచ్చిన వినతులపైన, మన నుంచి స్వీకరించిన ప్రతిపాదనలపైన, మన మనుగడ గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాక పోవడం, తాజాగా ఏర్పడిన పరిణామాల వల్ల మనం సమ్మెలోకి వెళ్లడం అనివార్యంగా మారింది. రాష్ట్ర సంఘం అన్ని జిల్లాల నాయకులతో సంప్రదించిన మీదట, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్వాహకుల భావోద్వేగాలను అనుసరించి 20 వ తేదీ నుంచి అనగా శుక్రవారం నుంచి సమ్మె చేయుటకు నిర్ణయించి సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది. నిర్వాహకులందరూ ఐకమత్యంతో సమ్మెలో పాల్గొని మన కోర్కెలను సాధించుకునేందుకు రాష్ట్ర సంఘానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడమైనది.
' అని మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం తమ నిర్వాహకులకు పిలుపునిచ్చింది.
0 Comments:
Post a Comment