సొంత ఇల్లు మీ కలా? ఎక్కడైనా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? నిర్మించిన ఇంటినే కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఏకంగా వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. క్రిస్మస్ రోజున ఈ విషయాన్ని ప్రకటించింది. గతంలో 8.35 శాతం ఉన్న వడ్డీ రేటును ఏకంగా 8.10 శాతానికి తగ్గించింది. హోమ్ లోన్లపై అతితక్కువ వడ్డీ రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అందిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు ఎస్‌బీఐ 8.15 శాతం వడ్డీతో హోమ్ లోన్లను ఆఫర్ చేసింది. ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించగానే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది.
గృహ సిద్ధి పేరుతో హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇప్పుడు మీరు ఎల్ఐసీలో హోమ్ లోన్‌కు అప్లై చేస్తే 8.10% వడ్డీ రేటు వర్తిస్తుంది. 30 ఏళ్ల గరిష్ట కాల వ్యవధి లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు గడువు ఎంచుకోవచ్చు. మహిళలకు వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయి. ప్రీ-పేమెంట్ పెనాల్టీ లేదు. ఇల్లు నిర్మించుకోవడం, ఇల్లు కొనుగోలు, ఫ్లాట్, ఇంటిని రిపేర్ చేయించడానికి హోమ్ లోన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్స్‌ని కూడా కొత్త వడ్డీ రేట్లకు మార్చుకోవచ్చు.
0 Comments:
Post a Comment