విశాఖను ఏపీ పరిపాలనా రాజధానిగా మార్చాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు రాజధాని అమరావతి ప్రాంత న్యాయవాదులు. ఏ హక్కు ద్వారా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం రైతుల నుంచీ డీల్స్ కుదుర్చుకొని... సంతకాలు చేసి... రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు... ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం... ఎలా రాజధానిని మార్చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్తామంటున్నారు. ప్రభుత్వం నిర్ణయం కోర్టుల్లో నిలబడదంటున్న లాయర్లు... కోర్టులు వేసే ఏ ప్రశ్నకూ వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అంటున్నారు. రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ఏయే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు?
అమరావతి రైతులకు ఇచ్చిన మాటేమిటి? రైతులకు జరిగే అన్యాయాన్ని భర్తీ చేసేదెవరు? ఏ హామీతో రైతుల నుంచీ భూములు తీసుకున్నారో... ఆ హామీ నెరవేరట్లేదు కాబట్టి... దాన్ని ఎలా భర్తీ చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదు కాబట్టి... రాజధానిని తరలించే ఛాన్స్ ఉండదంటున్నారు. హైకోర్టు విషయంలోనూ లాయర్లు ఇదే వాదన వినిపిస్తున్నారు. హైకోర్టును రాయలసీమకు తరలించినా... వేరే బ్రాంచిలు ఏర్పాటు చేసినా కోర్టు మెట్లెక్కుతామంటున్నారు.
జనరల్‌గా ఏ విషయమైనా చర్చలతో త్వరగా తేలుతుందే తప్ప... కోర్టు పరిధిలోకి వెళ్లిందంటే... వాయిదాలు పడే పరిస్థితి ఉంటుంది. రాజధాని అంశంపై లాయర్లు కోర్టుకు వెళ్తే... ముందుగా కోర్టు... ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ అంశంపై ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యమని కోరే పరిస్థితి ఉంటుంది. ఇందుకు కొంత గడువు ఇస్తుంది. ఆ తర్వాత గడువు సమయం అయ్యేవరకూ ఈ అంశం తేలకుండా ఉంటుంది. గడువు తర్వాత... రెండువైపులా వాదనలు జరుగుతాయి. ఆ వాదనలు జరిగే తీరును బట్టీ... హైకోర్టు వెంటనే నిర్ణయాన్ని ప్రకటించొచ్చు లేదా వాయిదా వెయ్యొచ్చు. ఇలా రాజధాని అంశం, హైకోర్టు తరలింపు అంశం... న్యాయపరమైన అంశాలతో ముడిపడి... వెంటనే ఎటూ తేలకుండా ఉండే పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు న్యాయ నిపుణులు.
ప్రభుత్వం మాత్రం... కేబినెట్ నిర్ణయమే ఫైనల్ అవుతుందని అంటోంది. రాజధాని అంశం పాలనాపరమైనదనీ, ఇందులో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

0 Comments:
Post a Comment