యువతకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించే యువతీయువకులకు రైలు టికెట్ల బేసిక్ ధరపై 50% రాయితీని ప్రకటించింది. నెలకు రూ.5,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ రైలు టికెట్లపై ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. అది కూడా సాధారణ రైలు సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్‌లకు ఈ రాయితీ వర్తించదు. ఒక స్టేషన్ దగ్గర్నుంచి మరో స్టేషన్‌కు 300 కిలోమీటర్ల పైన సెకండ్, స్లీపర్ క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించేవారికి రాయితీతో టికెట్లను ఆఫర్ చేయనుంది భారతీయ రైల్వే.
రాయితీ కేవలం బేసిక్ ఫేర్‌పైన మాత్రమే. రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు యథాతథంగా ఉంటాయి.
రాయితీ కేవలం బేసిక్ ఫేర్‌పైన మాత్రమే. రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు యథాతథంగా ఉంటాయి.
0 Comments:
Post a Comment