స్క్రీన్ లైటింగ్ నుంచి కళ్లను రక్షించుకోండిలా..
స్క్రీన్ లైటింగ్ ఉంటేనే గాడ్జెట్‌ను వాడగలం. ఈ లైటింగ్ మీ కళ్లకు అలసట తీసుకురావచ్చు. ఈ మెయిల్ చూసినా, మెసేజ్ చదివినా, వాట్సప్, ఇనిస్టాగ్రామ్ ఇలా దేనికైనా స్మార్ట్ డివైజ్ లను ఎక్కువగా వాడుతున్నాం. తప్పనిసరిగా జరుగుతున్న ఈ పనుల నుంచి కళ్లకు అలసట రాకుండా కాపాడుకోవాలంటే పడుకోబోయే ముందు ఈ పనులు చేయడం తప్పనిసరి.
గంటల తరబడి సిస్టమ్‌లపై, ఫోన్లతో పనిచేసే వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నిద్రపోయే సమయాన్ని బట్టి కూడా ఇవి మారుతుంటాయి. హార్మోన్ ల ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోతే రెటీనాపై ప్రభావం చూపి కళ్లను ఇబ్బందికి గురిచేస్తాయి. వీటి కారణంగా కళ్లు పొడిగా అనిపించడం, మసక రావడం, ఎరుపెక్కడం, దురద పుట్టడం వంటివి వస్తాయి.
స్క్రీన్‌కు దూరంగా ఉండాలి:
ఆప్తమాలజిస్టులు(కంటి వైద్యులు) 20-20-20 రూల్ ను ఫాలో అవమంటున్నారు. పత్రి 20నిమిషాలకోసారి స్క్రీన్ చూడటానికి గ్యాప్ ఇచ్చి 20సెకన్ల పాటు 20అడుగుల దూరంలో ఉండండి. ఇవి మీ కంటి కండరాలకు రిలాక్స్ ఇవ్వడమే కాక ఎక్కువ సేపు స్క్రీన్ చూసినా ఇబ్బంది లేకుండా చేస్తాయి.టెక్స్ట్ సైజ్ పెంచాలి
మీ డివైజ్‌లలో స్క్రీన్ సైజ్ పెంచుకోండి. ఫలితంగా కంటి చూపులో సమస్యలు రాకుండా ప్రతి చిన్న అక్షరం స్పష్టంగా చదవగలం.రెప్పకొడుతూ ఉండండి
ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. కొందరు డాక్టర్లు మీ కంప్యూటర్లలో 20నిమిషాలకోసారి బ్లింక్ అయ్యేలా రిమైండర్ పెట్టుకోమని చెప్తుంటారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రతి 15-20నిమిషాలకు రెప్పకొడుతూ ఉండాలి. కానీ, మనం స్క్రీన్ చూడగానే కన్నార్పడం మర్చిపోతాం. దాని వల్లే ఈ సమస్యలు వస్తాయని అంటున్నారు. సమస్య ఎక్కువగా అనిపిస్తే ల్యూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడితే మంచిది.స్క్రీన్ లైటింగ్ తగ్గించండి
ప్రత్యేకించి రాత్రి సమయాల్లో స్క్రీన్ లైలింగ్ ను తగ్గించాలి. కంటికి చూడదగినంత వెలుతురు ఉంటే సరిపోతుంది. కొన్ని ఫోన్లలో ఆటోమేటిక్ స్క్రీన్ బ్రైట్‌నెస్(automatic screen brightness) ఆప్షన్ ఉంటుంది. అది సెలక్ట్ చేసుకుంటే పరిసరాల వెలుతురిని బట్టి స్క్రీన్ లైటింగ్ మారిపోతుంది. నైట్ టైంలో స్క్రీన్ చూసేటప్పుడు బ్లూ లైట్‌ను అడ్డుకునే కళ్లజోళ్లు ధరిస్తే ఇంకా మంచిది.కళ్లజోడు మారుస్తూ ఉండండి:
ఎప్పుడూ ఒకే కళ్లజోడు వాడుతూ ఉన్నా ఇబ్బందే. కళ్లకు అందాల్సిన ఆక్సిజన్ స్థాయిని అడ్డుకుని కళ్లకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. కళ్ల జోడు ఉంది కదా అని రాత్రి సమయాల్లో, వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫోన్లు, కంప్యూటర్లు వాడేస్తుంటాం. వాడే లెన్స్ పవర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కార్నియల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీయొచ్చు. ఇది నమ్మకపోతే లెన్స్ మార్చి మీరే ఓ సారి పరీక్ష చేసుకోండి. తేడా గమనించగలం.More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New
0 Comments:
Post a Comment