Health : టమాట సూప్... రెగ్యులర్‌గా తాగితే అన్నీ ప్రయోజనాలే...వివరాలు
Health : టమాట సూప్... రెగ్యులర్‌గా తాగితే అన్నీ ప్రయోజనాలే...
టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలుసు. టమాట సూప్ కూడా ఆరోగ్యానికి మేలని చెప్పుకోవాల్సిన పనిలేదు. చల్లటి వాతావరణంలో గోరు వెచ్చగా ఉండే సూప్‌ని అలా అలా తాగుతుంటే... ఒంట్లో వేడి చేరి... ఎంతో ఉపశమనం కలుగుతుంది. అందులో కాస్త కరకరలాడే చిప్స్, ఇతరత్రా స్నాక్స్ కూడా వేసుకుంటే ఆ టేస్టే వేరు. నిజానికి టమాటో సూప్ తాగడం ఎంతో మంచిది. టమాటా సూప్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్స్ A, C, K, కాపర్, సెలెనియం ఉంటాయి. దీన్ని తయారుచేసుకోవడం కూడా ఎంతో తేలిక. మూడే మూడు స్టెప్స్‌లో అయిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనప్పుడల్లా టమాట సూప్ తయారుచేసుకొని... తాగేయమంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇది స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.
రక్త ప్రసరణ వ్యవస్థ, కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేలా చేస్తుంది.
మంచి టమాటాల్ని ఎంచుకోవాలి. ఆర్గానిక్ టమాటాలు లేదా విదేశాల నుంచీ దిగుమతి చేసుకునే రోమా టమాటాలైతే భలే ఉంటాయి. లోకల్ టమాటాలు కూడా అదిరిపోయే టేస్ట్ ఇస్తాయి. ఆ టమాటాల్ని నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత చల్లటి నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటి స్కిన్ (తొక్క) తొలగించడం తేలిక. మరో రకమైన టేస్ట్ కావాలనుకుంటే... టమాటాల్ని రోస్ట్ (వేపుడు) చెయ్యవచ్చు.
ఇప్పుడు ఓ పాన్‌లో బట్టర్ (వెన్న) వేసి... కొన్ని ఉల్లిపాయల ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపాలి. ఇప్పుడు టమాటాల్ని ముక్కలు చేసి వెయ్యాలి. కొంత నీరు పొయ్యాలి. ఇప్పుడు చికెన్ లేదా కూరగాయలు వేసి... 40 నిమిషాలపాటూ ఉడికించాలి. ఇప్పుడు చూస్తే... నైస్‌గా, క్రీమీగా ఉన్న సూప్ రెడీ.

0 Comments:
Post a Comment