తిరువనంతపురం : కేరళకు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్ళు ఒకే రోజు పుట్టారు. చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో... ఒకే ఆహారం... ఒకే రకమైన వస్త్రధారణతో పెరిగారు. అంతేకాదు... పదిహేనేళ్ళు వచ్చేవరకు పాఠశాల తరగతి గదిలోనూ ఒకే వరుసలో కూర్చునేవారు. ఇప్పుడు ఈ నలుగురూ ఒకే రోజు పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ అయిదుగురు కవలలు (ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు) పుట్టినప్పటి నుంచే వార్తల్లో నిలిచారు. తక్కువ బరువుతో పుట్టడం, తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడం వంటి ఇబ్బందుల గురించి స్థానిక మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి.
ఒకే రోజు పెళ్లి... వీళ్ల పేర్లు... ఉత్రా, ఉత్రజా, ఉతరా, ఉతమా.
వీరి సోదరుడి పేరు ఉత్రాజన్. 1995 నవంబర్ 18న జన్మించిన ఈ నలుగురు అక్కాచెల్లెళ్ళూ 2020 ఏప్రిల్ 26 న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 'ఇప్పుడు మా ఇంటి దగ్గర చర్చ అంతా మా పెళ్లి గురించే. మేము ఇంకా పెళ్లి చీరలు కొనాల్సి ఉంది. అందరం కూడా ఒకే డిజైన్, ఒకే రంగు బట్టలు తీసుకుంటాం' అని చెబుతున్నారు.
ఆమె ఒక జర్నలిస్టు. ఆమెకు కాబోయే భర్త కూడా రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.
తమ పెళ్లి హిందూ సాంప్రదాయాల ప్రకారం ఓ ప్రముఖ ఆలయంలో జరుగుతుందని వాళ్లు చెప్పారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా సంబంధాలు చూసేందుకు వీరికి తల్లి రెమాదేవి సాయపడ్డారు.
సాధారణంగా ఇలాంటి పెళ్లిళ్లలో వధూవరుల కులం, మతాలతో పాటు ఆర్థికపరమైన విషయాలు, విద్యార్హతలను ఎక్కువగా చూస్తుంటారు. వధూవరుల జాతకాలు కలుస్తున్నాయో లేవో పండితులు చూసి చెబుతారు.
కానీ, వీళ్లవి పెద్దలు చూసి, నిశ్చయించిన పెళ్లిళ్లు కాదు. వధూవరుల ఇష్టాల ప్రకారమే పెద్దలు 'పెళ్ళి' నిర్ణయం తీసుకున్నారు. మొన్న సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. అయితే, ఈ నలుగురు అక్కాచెల్లెళ్లలో ముగ్గురు కువైట్‌లో ఉద్యోగాలు చేస్తుండడంతో తమ సొంత ఊరిలో జరిగిన ఆ వేడుకకు రాలేకపోయారు. పెళ్లి మాత్రం ఎవరికీ అడ్డంకులు రాకుండా, పక్కా ప్రణాళికతో ఒకేరోజు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వీరి వివాహానికి దగ్గరి బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మీడియా రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు కూడా పెద్దఎత్తున వచ్చే అవకాశముంది. ఇక ఈ అక్కాచెల్లెళ్లందరూ చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగినా... ఎవరి అభిరుచులు వారికి ప్రత్యేకంగా ఉన్నాయి. ఉత్రజా చదువులో దిట్ట. ఉతమాకు సంగీతం అంటే ప్రాణం. అందుకే ఆమె వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించారు. ఉత్రా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. ఉత్రజా, ఉతమా... అనస్తీషియా టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు.
'మాలో ఇద్దరికి పెళ్లి సంబంధాలు ముందే వచ్చాయి. కానీ... మేమంతా ఒకే రోజు పెళ్లి చేసుకోవాలనేది మా అమ్మ కోరిక. దాంతో అందరికీ సంబంధాలు దొరికే వరకూ వేచిచూశాం' అని ఉత్రజా చెప్పారు.
ఖర్చు విషయం పక్కన పెడితే... బిడ్డలందరూ ఒకేసారి పెళ్లి చేసుకోవాలన్న సెంటిమెంట్ తల్లిలో బలంగా ఉండటం కూడా వీరికి ఒకేసారి పెళ్లి చేయడానికి ఒక కారణం.

0 Comments:
Post a Comment