న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ వేళ ఆఫర్లకు తెరతీసింది. జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు దాదాపు అన్ని ఉత్పత్తులపై వందలాది డీల్స్ ప్రకటించింది. నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. ‘ఫ్లిప్‌స్టార్ట్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 వరకు రాయితీ లభించనుంది. హెడ్‌ఫోన్లు, బోట్, జేబీఎల్, సోనీ ఇతర కంపెనీల హెడ్‌ఫోన్లు వంటి వాటిపై 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కొత్త స్మార్ట్‌ఫోన్ కనుక కొనగోలు చేస్తే మొబైల్ ఫోన్ కవర్లపై డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, టీవీలు, హోం అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు రాయితీ లభించనుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
0 Comments:
Post a Comment