Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 29 December 2019

Flash....Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..

Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..
District wise logins available....

Click below link 👇👇

Server 1
https://ammavodihm3.apcfss.in/logout.htm

Server 2

http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తింపు
పాఠశాల విద్యా శాఖ ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని న్యూస్‌ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు మాత్రమేనని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌ 4న పాఠశాల విద్యాశాఖ విడుదలచేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని  వివరించారు. 


🌷 జగనన్న అమ్మఒడి గురుంచి
అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.

జాబితా-1:(List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

_జాబితా-2:_(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

_జాబితా-3:_(Re confirmation/re verification required) ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.
మీకు 3 రకాల ఫార్మ్స్ పంపడం జరిగింది. 
ఇందులో  
1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో _List-I_లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.
2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో _List-II & List-III_ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.
3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II & List-III_లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

✍🏻 పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు_అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలి.

ప్రధానోపాధ్యాయులు అందరికీ విజ్ఞప్తి 
అమ్మఒడి ఫైనల్ లిస్ట్ జాబితా కన్ఫర్మ్ చేయుటకు మీకు లాగిన్ ఇవ్వబడింది
అమ్మ ఒడి పథకం లో మీ పాఠశాల యొక్క విద్యార్థులు ఎవరు అర్హులు ఎవరు అర్హత పొందడానికి ఇన్ఫర్మేషన్ పొంది ఉండాలి అని డేటా ఇవ్వడం జరిగింది కావున సత్వరమే రేపు సాయంత్రం లోగా అందరు ప్రధానోపాధ్యాయులు ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య కి సరిపడింది లేనిది చూసుకోగలరు మరియు మీ లాగిన్ ఓపెన్ చేయగానే ఫైనల్ లిస్ట్ జాబితా యందు రిక్వెస్ట్ కన్ ఫర్మేషన్ ఆఫ్ గివెన్ డేటా అనేటటువంటి భాగములో తరగతి వైజు ఇంకనూ మీ పాఠశాలలో  కన్ఫర్మేషన్ చేయవలసిన టువంటి విద్యార్థుల యొక్క వివరాలను అడుగుతుంది ఆ వివరాలు యొక్క డాక్యుమెంట్లు తెప్పించుకుని రేపు సాయంత్రం లోగా వాటిని పూర్తిగా కన్ఫర్మేషన్ చేయాలి అందు భాగములో ఏ విధమైనటువంటి అశ్రద్ధ వహించడం తద్వారా విద్యార్థులు అమ్మ ఒడి అర్హత అవకాశాన్ని  కోల్పోవడం అనేది మీ తప్పిదమని గ్రహించగలరు కావున రేపు తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఆ యొక్క ఆ యొక్క ఫైనల్ జాబితాని రేపు సాయంత్రం లోగా కన్ఫర్మేషన్ చేసుకోవాలి లేదా దానికి పూర్తి బాధ్యత ఆ  సంబంధిత ప్రధానోపాధ్యాయులు దే కానీ వేరే ఎవరిది కాదని గమనించగలరు

ఎవరైనా తల్లి లేదా గార్డియన్ తమ విద్యార్థి వివరాలు తప్పు గా నమోదయ్యాయి సవరించమని కోరితే వారిచే క్రింది అప్లికేషన్ పూర్తి చేయించి వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు తల్లి లేదా గార్డియన్ సంతకం తో MEO ఆఫీసు లో అందజేయమని చెప్పండి.
Download... application is for any corrections

*💥AMMAVODI District LOGINs...*

http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html

➡(1) అమ్మ ఒడికి అర్హులైన వారి వివరాలు
తరగతుల వారీగా HM LOGINs లో
లభ్యమవుతున్నాయి.

➡(2) అర్హులైన వారి తల్లుల బ్యాంకు అకౌంట్
తదితర వివరాలు సరిచూసుకోండి.

➡(3) అర్హులు కాని వారి LIST లో
వారి అనర్హతకు కారణం ఏంటో కూడా పొందుపరచారు.
అనర్హతకు కారణాన్ని గుర్తించి
తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు /తెలియజేయాలి.

Examples :
(A) Electricity more than 300 Units
      వారి కరెంటు మీటర్ నంబర్ తో సహా
(B) Dry Land : 11.37
(C) Govt Employee / Pensioner)

➡(4) HM తో పాటు... ఏ తరగతి ఉపాధ్యాయులు
ఆ తరగతి విద్యార్థుల అర్హత / అనర్హత
వివరాలను తెలుసుకొని ఉండడం మంచిది / బాధ్యత.


గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..
46,78,361 లక్షల మంది తల్లులకు లబ్ధి
జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ... 9న తుది జాబితా ప్రదర్శన
అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ


 రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు (ఆదివారం) రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు.

జనవరి 9న తుది జాబితా ప్రదర్శన
ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.


అమ్మ ఒడి షరతులు
💥 అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే 💥

ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.

మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.

ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:

1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే...

2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే...

3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా...

4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే...

5. 4చక్రాల వాహనం ఉంటే..

6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే...

7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే..

8. గ్రామంలో నివాసం లేకుంటే...

9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే...

10. మరణించి ఉంటే...

11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే...

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.
అమ్మఒడి అర్హుల జాబితా నేడు 28/12/2019 ప్రదర్శన
గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..
46,78,361 లక్షల మంది తల్లులకు లబ్ధి
జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ... 9న తుది జాబితా ప్రదర్శన
అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబ్ధి దారులుగా తేలారు.
జనవరి 9న తుది జాబితా ప్రదర్శన
ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న  లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top