డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పదవ తరగతి పాసైన వారికి శుభవార్త చెప్పింది. పదవ తరగతి అర్హతతో డీఆర్‌డీఓ 1817 పోస్టులను భర్తీ చేయబోతుంది. డీఆర్‌డీఓ అభ్యర్థుల నుండి ధరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఓ 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఈ ఉద్యోగాల భర్తీ సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్ మెంట్ ద్వారా జరగనుంది. కొన్ని రోజుల క్రితమే డీఆర్‌డీఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 23వ తేదీ 2020 వరకు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలంటే పదవ తరగతి లేదా ఐటీఐ పాసై ఉండాలి.
ఉద్యోగాలకు ధరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేయటానికి ధరఖాస్తు ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. రెండు తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, వైజాగ్ తో పాటు జైపూర్, పూణె, నాసిక్, నాగ్ పూర్, గ్వాలియర్, మైసూర్, ఆగ్రా ప్రాంతాలలో డీఆర్‌డీఓ కేంద్రాలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ పోస్టులను ఈ కేంద్రాలలో డీఆర్‌డీఓ సంస్థ భర్తీ చేయనుంది.
drdo.gov.in వెబ్ సైట్ లో డీఆర్‌డీఓ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1817 ఖాళీలు ఉండగా జనరల్ కు 849, ఓబీసీ 503, ఈడబ్ల్యూఎస్ 188, ఎస్సీ 163, ఎస్టీలకు 11 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు 18 వేల రూపాయల నుండి 56 వేల రూపాయల వరకు డీఆర్‌డీఓ వేతనంగా ఇస్తుంది.
డీఆర్‌డీఓ ఎంపికైన అభ్యర్థులకు జీతంతో పాటు అనేక ప్రయోజనాలను కూడా కల్పించనున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో డీఆర్‌డీఓ నియామక పరీక్షలు నిర్వహించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
View... official web
drdo.gov.in
0 Comments:
Post a Comment