Diabetes Tips : 10 గంటల ప్లాన్‌తో డయాబెటిస్‌కి చెక్...
Diabetes Tips : టైమ్ ప్రకారం తినడం... ప్రత్యేక టైమ్‌లో మాత్రమే తినడం... ఈ రెండూ పాటిస్తే... డయాబెటిస్‌ను ఎక్కువగా కంట్రోల్ చెయ్యడానికి వీలవుతుందని తాజా పరిశోధనలో తేలింది. రోజూ కరెక్టుగా 10 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటే... డయాబెటిస్ దిగివస్తుందంటున్నారు. ఈ ఫార్ములా డయాబెటిస్ ఎక్కువగా ఉండేవారికి బాగా సెట్టవుతుందంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. అమెరికాలోని సాల్క్ ఇన్‌స్టిట్యూట్, UC శాన్‌డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్... ఈ పరిశోధన చేసింది. తిండి విషయంలో 10 గంటల్లోనే ఆహారం తింటూ... సంప్రదాయ (ట్రెడిషనల్) మందులు వాడుతూ ఉంటే... బరువు తగ్గడమే కాక... పొట్టలో కొవ్వు కరుగుతూ... బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతూ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నట్లు పరిశోధనలో తేలింది.
జనరల్‌గా డయాబెటిస్ ఉన్నవారు... కేలరీలు పెరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేదే ఎక్కువగా ఆలోచిస్తారు. దాని బదులు... ఏ టైంలో తింటున్నాం అన్నది ఎక్కువగా ఆలోచించాలంటున్నారు సైంటిస్టులు. ఓ టైమ్ ప్రకారం తింటే... మన బాడీలో ఉండే బయోలాజికల్ క్లాక్ (జీవ గడియారం).. మన శరీరాన్ని అందుకు తగ్గట్టుగా సెట్ చేస్తుందనీ, తద్వారా అన్ని కణాలూ అందుకు తగ్గట్టుగా పనిచేసి... ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు.
దీనికి సంబంధించి సైంటిస్టులు... 19 మందిని (13 మంది పురుషులు, 6 మంది మహిళలు) పరిశోధించారు. రోజుకు 14 గంటల సమయంలో... వారు ఏయే ఆహారం ఎప్పుడెప్పుడు తింటున్నారో తెలుసుకున్నారు. ఇందుకోసం వాళ్లకు ఓ యాప్ ఇచ్చారు. 86 శాతం మంది తాము తినే ఆహారం వివరాల్ని ఎప్పటికప్పుడు ఆ యాప్‌లో ఎంటర్ చేశారు. చాలా మంది మధ్యాహ్నం వేళ లేటుగా తింటూ... రాత్రివేళ త్వరగా తింటున్నట్లు గ్రహించారు. ఇలా చేసే బదులు... రోజూ 10 గంటలు టైమ్ సెట్ చేసుకొని... ఆ సమయంలోనే ఏం తినాలన్నా తినేయాలంటున్నారు డాక్టర్లు. సపోజ్ ఉదయం 8 గంటలకు టిఫిన్ తింటే... సాయంత్రం 6 గంటల్లోపు భోజనం చేసేయాలంటున్నారు డాక్టర్లు. తద్వారా... ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదంటున్నారు. దీని వల్ల ఎక్కువ సేపు నిద్ర పోయే వీలు కలుగుతుందనీ, బాడీ వెయిట్ తగ్గుతుందనీ, గుండెకు వచ్చే సమస్యలు తగ్గుతాయనీ, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయని అంటున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే... ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

0 Comments:
Post a Comment