క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ తగలనుంది. జనవరి 1 నుంచి బ్యాంకులు పెనాల్టీల మోత మోగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిటీ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అల్టిమేటం జారీ చేసింది. నిర్ణీత గడువు లోపు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోతే.. 4.8 శాతం అధిక వడ్డీతో అసలు మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అంతేకాకుండా ఈ రూల్ 2020 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాంక్ ఇప్పటికే సిటీ బ్యాంక్ ఇండియా ఆయిల్ క్రెడిట్ కార్డు యూజర్లకు విషయాన్ని తెలియజేయగా.. ఇతర క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా ఇదే నిబంధన వర్తించే అవకాశం కనిపిస్తోంది.
కాగా, సిటీ బ్యాంక్ నాలుగు స్లాబ్ రేట్ల కింద వడ్డీని వసూలు చేస్తోంది.
37.2%, 39%, 40.8%, 42% ప్రస్తుతం అమలవుతున్న వడ్డీ రేట్లు. ఇవి కాస్తా జనవరి 1 నుంచి 42%, 42%, 42%, 43.2%గా మారనున్నాయి. ఇదిలా ఉంటే క్రెడిట్ కార్డుదారులు తమ బిల్లును డ్యూ డేట్‌లోపు 5 శాతం చెల్లించాలి. లేకపోతే అధిక పెనాల్టీల బాదాడు తప్పదు. రూ.500తో పెనాల్టీ మొదలు అవుతుండగా.. దానికి జీఎస్టీ అదనంగా యాడ్ అవుతుంది. అటు చెల్లించని కార్డుపై ఏకంగా 48 శాతం వడ్డీ పడుతుంది. కాగా, సిటీ బ్యాంక్ అమలులోకి తీసుకొస్తున్న ఈ కొత్త రూల్‌ను ఇతర బ్యాంకులు కూడా జనవరి నుంచి తీసుకొస్తే పెనాల్టీలు బాదుడు తప్పదు.
0 Comments:
Post a Comment